Elon Musk : ప్రపంచ ప్రఖ్యాతుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. టెక్ బిలియనీర్‌గా ఉన్న ఆయనకు విశేష గుర్తింపు ఉంది. ప్రతిభావంతులు, ప్రభావిత వ్యక్తుల జాబితాలో అగ్రస్థానాన్ని పొందారు. టెక్ ప్రపంచంలో అనేక ఆవిష్కరణలు, అనేక సంచలనాలు సృష్టించడంలో ఘనాపాటి ఆయన. తనదైన వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని అబ్బూరపర్చడంలో ఆయనకు ఆయనే సాటిఇ. తాజాగా ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెర తీశారు.
సంచలనాల ఆవిష్కర్త Elon Musk
ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెక్ అభివృద్ధి శక్తి పారిశ్రామికవేత్త. 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన తన విద్యను అమెరికాలో పూర్తి చేసి, పలు రంగాల్లో పరిశోధనలు చేశారు. టెస్లా కంపెనీని స్థాపించి తద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాన్ని సృష్టించారు. స్పేస్‌ఎక్స్ ద్వారా అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. స్పేస్ ఎక్స్ ద్వారా ఆయన మార్స్ ఉపనివేశం లక్ష్యాన్ని ముందుంచారు. పేపాల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను స్థాపించి డిజిటల్ చెల్లింపుల్లో విప్లవం తీసుకొచ్చారు. స్టార్‌లింక్ పేరుతో అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. న్యూరాలింక్ ద్వారా మెదస్సు, కంప్యూటర్ మధ్య ఉన్న సంబంధాన్ని అభివృద్ధి చేయడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ఎలాన్ మస్క్ దృష్టిని సారించారు. ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకొని దానికి Xగా పేరు మార్చి మనుగడలో ఉంచారు. దీనిని నూతన మార్గాల్లో అభివృద్ధి చేస్తున్నారు. తన ఆవిష్కరణలతో మానవ జీవితాన్ని సులభతరం చేయడంలో మస్క్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వాస్తవాలను మించిన కల్పనలు నిజం చేయడమే తన జీవిత లక్ష్యమని మస్క్ అంటుంటారు.
Elon Musk ఇప్పుడు చేసిందేమిటంటే..
ఎలాన్ మస్క్ తన X (ట్విట్టర్) ప్రొఫైల్ డిస్‌ప్లే పేరును Kekius Maximus గా మార్చుకున్నారు. అలాగే ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చి ప్రఖ్యాత Pepe the Frog మీమ్ చిత్రాన్ని పెట్టుకున్నారు. ఇది గోల్డెన్ ఆర్మర్ ధరించి ఒక వీడియో గేమ్ కంట్రోలర్ పట్టుకుని ఉంటుంది.
Kekius Maximus అంటే?
Kekius Maximus అనేది క్రిప్టోకరెన్సీ టోకెన్. ఇది Ethereum, Solana సహా అనేక బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్‌లపై పనిచేస్తోంది. ఇటీవల ఈ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో ప్రముఖ సంస్థగా ఎదిగింది. ఇన్వెస్టర్లను ఇది ఆకర్షిస్తోంది. డిసెంబర్ 27 నాటికి Kekius సుమారు 0.005667 డాలర్ల వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి. ఇది 24 గంటల్లో 497.56 శాతం పెరిగింది. అయితే.. మస్క్ ప్రొఫైల్ కొత్త పేరుకు, క్రిప్టోకరెన్సీ మధ్య సంబంధం ఏమిటో ఇంకా స్పష్టం కాలేదు. Xలో ఒక పోస్ట్‌లో ఆయన Kekius Maximus త్వరలో హార్డ్‌కోర్ PoEలో స్థాయి 80ను చేరుతుందని పేర్కొన్నారు.
ఇది తొలిసారి కాదు…
సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం ఎలాన్ మస్క్‌కు కొత్తేమీ కాదు. ఆయన తన X ప్రొఫైల్ పేరు Mr. Tweetగా మార్చుకున్నట్టు 2023 జనవరి 26న ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు ఎలాన్ మస్క్ తన పేరును Kekius Maximusగా మార్చుకోవడం చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..