ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు (Chhattisgarh -Odisha border)లో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పులు జనవరి 19 రాత్రి నుంచి ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగాయి. మావోయిస్టులు (Maoists) ఉన్నారనే సమాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా అందుకున్న భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కోబ్రా దళాలు, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) కలిసి అమలు చేశాయి.
మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు
ఎన్‌కౌంటర్ (Chhattisgarh Encounter )లో హతమైన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జైరాం అలియాస్ చలపతి కూడా ఉన్నట్టు గారియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేచా తెలిపారు. అతడిపై రూ. 1 కోటి రివార్డు ఉందని చెప్పారు. మిగతా మృతుల వివరాలను ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
భారీగా మావోయిస్టుల సామగ్రి స్వాధీనం
మావోయిస్టుల శిబిరం నుంచి పోలీసులు పెద్దమొత్తంలో ఆయుధాలు, గోల్బారెడు గన్, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
నష్టపోతున్న మావోయిస్టు పార్టీ
ఇప్పటి వరకు 2025లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన వివిధ ఎదురుకాల్పుల్లో 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2024లో భద్రతా బలగాలు 219 మంది మావోయిస్టులు హతమయ్యారని సమాచారం.
Chhattisgarh ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా కీలక ప్రకటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఈ ఎన్‌కౌంటర్‌ను ప్రశంసిస్తూ భారతదేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించాలన్న సంకల్పంతో భద్రతా బలగాలు చురుకుగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. నక్సలిజం క్షీణిస్తోందనడానికి ఈ దాడి సంకేతమని తెలిపారు. అమిత్ షా ‘X’లో ఈ మేరకు పోస్టు చేశారు.
భారతదేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేసే దిశగా ఇది ఒక ప్రధాన అడుగు అని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ సీఎం ఏమన్నారంటే…
ఎన్‌కౌంటర్ సంఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి (Chief Minister Vishnu Deo Sai)
యి మాట్లాడారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో భాగంగా 2026 మార్చి నాటికి రాష్ట్రం నక్సలిజం సమస్య నుంచి పూర్తిగా విముక్తమవుతుందని పేర్కొన్నారు. భద్రతా బలగాల శౌర్యాన్ని కొనియాడుతూ మా సైనికుల విజయానికి సలాం చెబుతున్నాను. వారి ధైర్యం అభినందనీయం అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..