Green Mobility | ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ వెహికిల్స్ వాడటకం గణనీయంగా పెరుగుతోంది. 2030 నాటికి వార్షిక వాహన అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండబోతోందని ఓ సర్వేలో తేలింది. 2024 నుంచి 2030 మధ్య కాలంలో భారతదేశం ఈ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని SBI క్యాపిటల్ మార్కెట్స్ (SBICAPS) నివేదిక చెబుతోంది. అయితే.. అంతర్గత దహన ఇంజిన్ (Internal Combustion Engine) వాహనాల వినియోగం కూడా దీంతోపాటే కొనసాగుతుందని వైల్లడైంది.
EV లపై పెరుగుతున్న ఆదరణ
EVల వినియోగం తొలుత చాలా తక్కువగా ఉండేది. 2019లో ఒక శాతం కూడా లేదు. క్రమేణా పెరుగుతూ 2024 నాటికి 7.4 శాతానికి పెరిగింది. ఎక్కువ ఫీచర్లు కలిగి ఉండటం వల్ల ఈ వాహనాలు వినియోగదారుల ఆదరణ పొందుతున్నాయి. పైగా మెయింటనెన్స్ చాలా తక్కువగానే ఉండటంతో వీటిని కొనుగోలు చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఈ వెహికిల్స్‌కు ఆదరణ పెరగడానికి ముఖ్య కారణం ఎకో ఫ్రెండ్లీ కావడమే అని తెలుస్తోంది. పెట్రోలు/డీజిల్‌తో పోలిస్తే ఈవీ వెహికిల్స్‌లో విద్యుత్తు వినియోగం తక్కువ ఖర్చుతో కూడి ఉండటం కూడా వీటికి ఆదరణ పెరగడానికి మరో కారణం.
EV విప్లవానికి ప్రోత్సాహకాలే కారణం!
భారత్‌లో EV విప్లవానికి అనేక ప్రోత్సాహకాలే కారణమని తెలుస్తోంది. ICE వాహనాలపై ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా EV వాహనాలపై 5 శాతం మాత్రమే వసూలు చేస్తోంది. చాలా రాష్ట్రాలలో తక్కువ రోడ్ ట్యాక్స్ అమల్లో ఉంది. FAME, PM E-DRIVE వంటి పథకాల ద్వారా ఈవీ వాహనదారులకు ప్రోత్సాహాలు అందుతున్నాయి. SPMEPCI (Scheme to Promote Manufacturing of Electric Passenger Cars in India) పథకం ప్రధానంగా కార్లపై దృష్టి పెడుతోంది.
బ్యాటరీల తయారీకి సర్కారు సపోర్టు
భారతదేశంలో వాహన తయారీదారులు (OEMs) వీటికి అవసరమయ్యే బ్యాటరీలను 75 శాతం వరకు విదేశాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితులను కొంతైనా అధిగమించడానికి దేశీయ మార్కెట్‌లో కసరత్తు జరుగుతోంది. భారత్‌లో 100 GWh బ్యాటరీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి సుమారు రూ. 500-600 బిలియన్ పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో Advanced Chemistry Cell (ACC) పథకం ద్వారా బ్యాటరీల తయారీదారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








