Fake Currency in Hundi : ఓ భక్తుడు అతి తెలివిని ప్రదర్శించాడు. హుండీలో నకిలీ కరెన్సీ నోట్లు వేసి మొక్కులు తీర్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) గాంధారి మండలం (Gandhari mandal)లో ఈ ఘటన చోటుచేసుకుంది. చాద్మల్ తండా ( Chadmal Thanda)లోని లచ్చమ్మ ఆలయంలో సంక్రాంతి వేడుకల అనంతరం హుండీలను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కిస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది. హుండీలో రూ. 500 నకిలీ నోట్ల (Fake Currency)ను ఆలయ కమిటీ సభ్యులు కనుగొన్నారు. వీటిని లెక్కిస్తే రూ. కోటి ఉన్నట్లు తేలింది.
డబ్బులు లెక్కిస్తుండగా…
గ్రామస్థులకు లచ్చమ్మ ఆలయ కమిటీ తక్కువ వడ్డీతో రుణాలు అందించే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ ప్రదేశంలో భక్తులు భక్తిపూర్వకంగా భారీగా విరాళాలు అందజేస్తారు. ఎప్పటిలాగే ఆలయ హుండీ నుంచి సేకరించిన డబ్బును గ్రామస్థులకు రుణంగా ఇచ్చారు. ఈ క్రమంలో పలువురు రుణగ్రహీతలు తాము తీసుకున్న డబ్బులను లెక్కిస్తుండగా నాలుగు నకిలీ నోట్లు తగిలాయి. వెంటనే ఈ విషయాన్నికమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హుండీ నుంచి సేకరించిన డబ్బులన్నీ పరిశీలించగా అందులో చాలా వరకు నకిలీ కరెన్సీలు ఉన్నట్టు కనుగొన్నారు. దీంతో కమిటీ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కలకలం రేపిన ఘటన
సంక్రాంతి పండుగ (Sankranti celebrations) సందర్భంగా లచ్చమ్మ ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. హుండీల్లో భారీగానే కానుకలు వేస్తుంటారు. వాటిని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయడంతోపాటు గ్రామస్థులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం ఇక్కడి ఆనవాయితీ. తాజాగా హుండీలో నకిలీ నోట్ల రావడం కలకలం రేపింది.
Fake Currency : జోరుగా నకిలీ నోట్ల చెలామణి
ప్రాథమిక సమాచారాన్నిబట్టి పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. కొంతకాలం క్రితమే బాన్సువాడ డివిజన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లను (Fake Currency) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చాద్మల్ తండాలోని లచ్చమ్మ ఆలయం హుండీలో నకిలీ నోట్లు దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








