Fast Track Immigration : హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ – ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP) ప్రారంభమైంది. భారతీయ పాస్‌పోర్టుదారులు, ఓసీఐ (ఓవర్సిస్ సిటీజన్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు మరింత వేగవంత, సులభతర ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థ (Fast Track Immigration – Trusted Traveller Programme)ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఎక్కువ సేపు వేచి చూడకుండా సులభంగా ఇమ్మిగ్రేషన్ పొంది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ కోసం ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ముందుగానే దరఖాస్తు చేసుకొని ధ్రువీకరణ పొందాక నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా వెంటనే క్లియరెన్స్ పొందొచ్చు. కౌంటర్ల వద్ద ఎక్కువ సమయాన్ని వెచ్ఛించాల్సిన అవసరం ఇక ఉండదు.
FTI-TTP సేవలు ఎలా పొందాలి?
- ఇమ్మిగ్రేషన్ కోసం ప్రయాణికులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తు సమయంలో పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి.
- పాస్‌పోర్ట్ గడువు ముగిసే వరకు ఈ సభ్యత్వం చెల్లుబాటు అవుతుంది.
- దరఖాస్తు ప్రక్రియలో భాగంగా వేలిముద్రలు, ముఖచిత్రం వంటి బయోమెట్రిక్స్‌ను నమోదు చేసుకోవాలి.
- అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- ధ్రువీకరణ తర్వాత తుది ఆమోదం లభిస్తుంది.
- దరఖాస్తు ధ్రవీకరణ అయ్యాక ఇమ్మిగ్రేషన్ చెల్లుబాటు అవుతుంది.
- ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఎలక్ట్రానిక్ గేట్ల ద్వారా సులభంగా, వేగంగా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందొచ్చు. ఈ ప్రక్రియ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.
Fast Track Immigration ద్వారా సురక్షిత ప్రయాణం
బయోమెట్రిక్ ధ్రువీకరణ, ముందస్తు స్క్రీనింగ్ వల్ల ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. ఈ ప్రక్రియ అక్రమ ప్రయాణాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది.వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ విమానాశ్రయాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుంది.
FTI-TTPతో ప్రయాణికులకు ప్రయోజనాలు
- సమయం ఆదా: ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద తక్కువ సమయం గడపడం వల్ల సమయం ఆదా అవుతుంది.
- సౌకర్యవంతమైన ప్రయాణం: సజావుగా, సులభంగా ప్రయాణించడం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
- మానసిక ప్రశాంతత: ప్రయాణంలో ఒత్తిడి తగ్గుతుంది.
- సమర్థవంత ప్రయాణం: సమర్థంగా, సజావుగా ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు.
డిజిటల్ యుగంలో వేగంగా దూసుకెళ్తున్న భారత్
అందొచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయాణాన్ని సులభతరం చేయడం ద్వారా భారతదేశం డిజిటల్ యుగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన FTI-TTP వ్యవస్థ ప్రయాణికులకు, విమానాశ్రయాలకు, దేశానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









2 Comments
[…] గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రపంచ ప్రామాణిక సౌకర్యాలను కలిగి […]
[…] రక్సెల్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను […]