Sarkar Live

Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Fatal Accident : రాజ‌స్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) త‌ర‌లిస్తున్న ఓ ట్రక్కు అదుపు త‌ప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 30

Fatal Accident

Fatal Accident : రాజ‌స్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) త‌ర‌లిస్తున్న ఓ ట్రక్కు అదుపు త‌ప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 30 వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. ఐదుగురు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. 37 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

భారీ ప్రమాదం (Fatal Accident) ఎలా జ‌రిగిందంటే..

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… రసాయన పదార్థాలు (కెమిక‌ల్స్‌) ర‌వాణా చేస్తున్న ఓ ట్ర‌క్కు జైపూర్‌- అజ్మీర్ జాతీయ ర‌హ‌దారి (National highway )పై అదుపు త‌ప్పి ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న రసాయనాలు అంటుకుని ఒక్క‌సారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూ చూస్తుండానే 30కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలు కూడా ఆ వాహనాల వ‌ద్ద‌కు చేరుకోలేనంత‌గా మంట‌లు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంతో సుమారు 300 మీటర్ల మేర రహదారి ప్రభావితమైంది.
ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. అటువైపు బ‌య‌ల్దేరిన వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే స్తంభించాయి. ప్ర‌మాద స్థ‌లి స‌మీపంలో మూడు పెట్రోల్ బంక్‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటికి మంట‌లు వ్యాపించ‌లేదు. అవి సుర‌క్షితంగానే ఉన్నాయి.

రక్షణ చర్యలు

ప్రమాద స్థలానికి 25కి పైగా అంబులెన్సులు చేరుకున్నాయి. గాయపడిన వారిని అత్యవసర సేవల కోసం ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. అగ్నిమాపక దళాలు మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించాయి. సంఘ‌ట‌న స్థ‌లానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ  (Rajasthan Chief Minister Bhajanlal Sharma) హుటాహుటిన చేరుకున్నారు. ప్ర‌మాద తీవ్ర‌త‌ను ఆయ‌న‌ స్వ‌యంగా ప‌రిశీలించారు. ర‌క్ష‌ణ చ‌ర్య‌లు వెంట‌నే చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అనంత‌రం SMS ఆస్ప‌త్రికి చేరుకొని క్ష‌త‌గాత్రులను ప‌రామ‌ర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచించారు.

దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసిన సీఎం

ముఖ్యమంత్రి తన ట్విట్టర్ (X) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ ఘోర ప్రమాద వార్త త‌న‌కు తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

జైపూర్-అజ్మీర్ హైవేపై జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం జాతీయ రహదారులపై ఉన్న అభ‌ద్ర‌త‌ను సూచిస్తోంది. ర‌సాయ‌నాలు ర‌వాణా చేస్తున్న క్ర‌మంలో వాహ‌నాల‌ను ఎంత అజాగ్ర‌త్త‌గా న‌డిపిస్తున్నారో ఈ ప్ర‌మాద‌మే నిద‌ర్శ‌న‌మనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌మాదాలు నిత్య‌కృత్యం

భారతదేశంలో ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలు నిత్య‌కృత్య‌మ‌య్యాయి. రసాయనాలు, పెట్రోల్ వాహనాలతో జరిగిన ప్రమాదాలు గతంలో అనేక సందర్భాల్లో సంభవించాయి.

  • సీతాపూర్, ఉత్తరప్రదేశ్ (2023): ఇక్క‌డ రసాయనాలతో లోడ్ చేసిన ఒక లారీ మరో వాహనాన్ని ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు మరికొన్ని వాహనాలకు వ్యాపించి, ఆ ప్రాంతం పూర్తిగా కాలిపోయింది. దీంతో 10 మంది మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు.
  •  విశాఖపట్నం గ్యాస్ లీక్ (2020): ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు వెయ్యి మంది అస్వస్థతకు గురయ్యారు, ప్రజలు తమ ఇళ్ల‌ను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన రసాయనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల లోపాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
  • పూణే హైవే అగ్ని ప్రమాదం (2016): జలంధర్ నుంచి ముంబై వెళ్తున్న ఒక పెట్రోల్ ట్యాంకర్ లీక్ అవడం వల్ల మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు మృతి చెందారు. 20 వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి.
  • రాయ్‌గఢ్ ట్యాంకర్ పేలుడు (2014): మహారాష్ట్రలో ఒక పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ మంటలు చెలరేగాయి. 10 మందికి పైగా మృతిచెందారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. రక్షణ చర్యలు ఆలస్యంగా చేప‌ట్ట‌డంతో ప్రజలు ప్రమాదంలో చిక్కుకున్నారు.
  • టుటీకోరిన్ అగ్ని ప్రమాదం (2009): ఒక రసాయన ఫ్యాక్టరీలో పేలుడు జరిగి, భారీ మంటలు చెలరేగాయి. 15 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?