Felicitated a bore well : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ పట్టణంలో ఈ రోజు ఓ విశేషం చోటుచేసుకుంది. 30 ఏళ్లుగా తమకు నిరంతరంగా నీళ్లు అందిస్తున్న బోర్‌వెల్ (హ్యాండ్‌పంప్)ను ప్రజలు సన్మానించి కృతజ్ఞతను చాటుకున్నారు. 1995లో తవ్విన ఈ బోరు నిత్యం తాగునీటి కొరతను తీరుస్తోందని మైసమ్మకాలనీ (Maisamma colony) వాసులు ఈ మేరకు సత్కరించారు. పసుపు రాసి, పూలమాల వేసి, కొబ్బరికాయలు కొట్టి శాలువా కప్పారు. ఈ అరుదైన ఘట్టం (felicitated a bore well) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతికూల పరిస్థిత్తుల్లోనూ నిరంతర సేవలు
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన వేసవిలోనూ ఈ బోర్‌వెల్ ఎప్పుడూ ఎండిపోకుండా ఈ బోర్‌వెల్ తమ దాహాన్ని తీరుస్తోందని స్థానికులు తెలిపారు. పట్టణంలో అనేక నీటి వనరులు అడుగంటిపోయినా మైసమ్మ కాలనీలోని ఈ బోరు మాత్రం నిరంతరంగా ఎలాంటి మరమ్మతులకు గురికాకుండా 30 ఏళ్లుగా సేవలు అందిస్తోందని, అందుకే ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించి సన్మానించామని అంటున్నారు.
bore well : మంత్రముగ్ధులవుతున్న నెటిజన్లు
ఒక బోర్‌వెల్‌ను గౌరవించడమనేది అరుదైన ఘటన. బోర్‌వెన్‌ను ఒక సాధారణ నీటి వనరుగా కాకుండా దాని కృషిని గుర్తించి ఘనంగా సత్కరించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. మానవ సంబంధాలను మాత్రమే కాకుండా ప్రకృతి వనరుల పట్ల ప్రేమను, గౌరవాన్ని కూడా ఈ ఘటన తెలియజేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పాపులర్ కావడంతో అనేక మంది ఈ దృశ్యాలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు.
ఈ ఘటన బోథ్ పట్టణంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా నీటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ప్రస్తుతం నీటి వనరుల కొరత పెరిగిపోతున్న దృష్ట్యా ఒక బోరువెల్‌ను ఇలా అభినందించడం నిజంగా హృదయాన్ని హత్తుకునే అంశంగా మారింది. 30 ఏళ్లుగా ఎండిపోకుండా నిలకడగా సేవలు అందిస్తున్న ఈ బోరు భవిష్యత్తులో కూడా అదే విధంగా సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
ఈ అరుదైన ఘట్టం నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించే ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. మనం అందరూ నీటిని సమర్థవంతంగా ఉపయోగించి, వృథా కాకుండా చూసుకోవాలి. అలాగే, ఇలాంటి సహజ వనరులను గౌరవించే దృక్పథాన్ని అందరూ అలవరుచుకోవాలనే సందేశాన్ని నొక్కి చెబుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..