Gandhi Bhavan : హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు (Youth Congress Leaders) ఒకరినొకరు పరుషపదజాలంతో తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించినవ వీడియోలు సోషల్‌మీడియాలో ఇపుడు వైరల్‌గా మారాయి. కొందరు నాయకులు కలిసి ఓ వ్యక్తిని కొడుతున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బుధవారం గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం ప్రారంభమైన కాసేపటికి గందరగోళం ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత ఇరు పక్షాలు పరస్పరం దూషణలు, దాడులకు దిగారు. పార్టీలో పదవుల కోసం ఇరువర్గాల నేతలు కొట్టుకున్నట్లు తెలిసింది.
ఇతర పార్టీల నుంచి వొచ్చిన వారికి పదవులు ఎలా కేటాయిస్తారంటూ కొత్తగూడెం జిల్లాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీ కోసం పని చేస్తున్న వారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఈక్రమంలో రెండు వర్గాల నాయకులు పరస్పరం పరుష పదాలతో దూషించుకున్నారు. ఆ తర్వాత వాగ్వాదం కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
గాంధీ భవన్‌లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన ఒరిజినల్ యూత్ కాంగ్రెస్ నేతలు
దీంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ
గాంధీ భవన్లోనే కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు pic.twitter.com/icyK6EEW6h
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








