Financial benefits to Congress from a foreign organization : విదేశీ సంస్థతో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నాయని వస్తున్న ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. జార్ట్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో నడిచే సంస్థతో సోనియాగాంధీ సత్సంబంధాలు కలిగి ఉన్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో విదేశీ సంస్థతో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తేటతెల్లమైందని విమర్శిస్తోంది. దీన్ని కాంగ్రెస్‌తోపాటే అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు తోసిపుచ్చారు. దీన్ని కూడా బీజేపీ తప్పుపడుతోంది. విపక్షాలతో కలిసి భారత్‌ను అస్థిర పర్చేందుకు విదేశీయులు కుట్ర పన్నుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అభివర్ణించింది.
కాంగ్రెస్‌లో కలవరం
కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వస్తున్న అవినీతి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ శిబిరంలో ఆ అంశం కలవరపెడుతోంది. జార్జ్ సోరోస్ ఫౌండేషన్ అనే విదేశీ సంస్థ నిధుల సహకారంతో నడిచే ఒక సంస్థతో సోనియా సత్సంబంధాలు ఉన్నాయని భారత జనతా పార్టీ (బీజేపీ) ఆరోపిస్తోంది. ఈ సంస్థ కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా భావించే ఆలోచన కలిగి ఉందని పేర్కొంది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ ప్రభావాన్ని సూచిస్తోందని మండిపడుతోంది. ఇదెంతో ఆందోళనకరమని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఆరోపించారు. ఇది తీవ్రమైన చర్య అని అభివర్ణించారు. పార్లమెంటు శీతాకాల సమావేశం ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటును మేం సవ్యంగానే నిర్వహించాలనుకుంటున్నాం. కొన్ని సమస్యలు రాజకీయ ఉద్దేశాలతో ముడిపడి ఉంటాయి. విదేశీ శక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సమస్య తీవ్రంగా మారుతుంది అన్నారు.
బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ బీజేపీ ఆరోపణలను అమెరికా ఖండిస్తోందని, భారత్‌ను అస్థిరపర్చేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విపక్షాలతో కలిసి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఆర్గనైజ్డ్ క్రైం అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP), హంగేరీ-అమెరికన్ వ్యాపారవేత్త కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ ఆరోపణలు ఏమిటంటే..
ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ (FDL-AP) ఫౌండేషన్ సహ అధ్యక్షురాలిగా గతంలో సోనియాగాంధీ ఉన్నారు. జార్డ్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో ఆ సంస్థ నడుస్తోందని బీజేపీ ప్రధాన ఆరోపణ. భారతదేశంలో కశ్మీర్‌ను ప్రత్యేక యూనిట్‌గా చూడాలని ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఏషియా పసిఫిక్ ఫౌండేషన్ భావిస్తోందని బీజేపీ తెలిపింది. అంతేకాదు.. జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో సోనియా గాంధీ అధినాయకత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ భాగస్వామ్యం కలిగి ఉందని అంటోంది. దీంతో భారత సంస్థలపై విదేశీ నిధుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపిస్తోంది. OCCRP నివేదికలను ఆధారంగా తీసుకుని అదానీ గ్రూప్‌పై రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని బీజేపీ గుర్తు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా విపక్షాలు కుట్ర చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని పేర్కొంది. OCCRPకు అమెరికా ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోందని, భారత్‌ను అస్థిరపర్చేందుకు ఇది పెద్ద కుట్ర అని బీజేపీ ఆరోపిస్తోంది. భారత అంతర్గత వ్యవహారాలపై విదేశీశక్తుల ప్రభావాన్ని, వాటి రాజకీయ ప్రాముఖ్యాన్ని ఈ సంబంధం స్పష్టం చేస్తోందని మండిపడుతోంది. కాంగ్రెస్‌పై బీజేపీ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు రాజకీయంగా వేడిని రగిలించాయి.
అగ్నికి ఆజ్యం
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై బీజేపీ ఆరోపణలతో రాజకీయ విమర్శలు పెరిగాయి. ఇదే సమయంలో బీజేపీ ఆరోపణలను అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు తోసిపుచ్చడం అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. శీతాకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ విషయంపై లోక్‌సభలో రాహుల్‌గాంధీకి పది ప్రశ్నలు వేస్తానని ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు విపక్షాలతో కలిసి OCCRP అనే మీడియా సంస్థ, హంగేరీ-అమెరికన్ వ్యాపారవేత్తలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
One thought on “Congress | విదేశీ సంస్థతో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్రయోజనాలు… రాజకీయ శిబిరంలో కలకలం”