రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం!
మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు పరుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొందరు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది.
కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు అధికారులు
రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. అయితే రెస్ట్ కోచ్ నుంచి దట్టంగా పొగలు వ్యాపించడంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొనంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.