Former MLA detained : బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ (Former MLA Shakil Aamir)ను హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGI Airport)లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయన దుబాయ్ నుంచి భారత్‌కు రాగా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్లపాటు పోలీసులకు చిక్కకుండా దుబాయిలో ఉన్న ఆయన తన తల్లి మరణ వార్త విని ఇక్కడికి వచ్చారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే పోలీసులు ఆయన్నుఅదుపులోకి తీసుకున్నారు. అయితే, తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు.
Shakil Aamir ను ఎందుకు అరెస్టు చేశారు?
హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ ఎదుట ఎమ్మెల్యే కుమారుడు రాహీల్ ఆమీర్ అలియాస్ సాహిల్ తన కారు నడిపి పోలీసు బ్యారికేడును ఢీకొట్టాడు. ఇదిఇ 2023 డిసెంబరులో జరగ్గా కలకలం రేపింది. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ ఆమీర్ సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన దుబాయ్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఇది ఉల్లంఘనగా భావించి పోలీసులు షకీల్ ఆమీర్ (Former MLA Shakil Aamir)పై లుక్ అవుట్ సర్క్యులర్ (LoC) జారీ చేశారు. ఆయనపై కేసు నమోదై ఉండగా దేశం విడిచి వెళ్లడాన్ని పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా పరిగణించారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ భారత్‌కు రావడంతో అరెస్టు చేశారు.
తల్లి మరణ వార్త.. భారత్‌కు రాక
బుధవారం రాత్రి షకీల్ ఆమీర్ (Former MLA Shakil Aamir) తల్లి మరణించారు. ఈ వార్త తెలుసుకున్న ఆయన గురువారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయంలోకి ప్రవేశించిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ నోటీసు ప్రకారం ఆయన్ను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తల్లి మృతికి సంబంధించిన వివరాలు పరిశీలించిన పోలీసులు మానవతా దృక్పథంతో షకీల్ ఆమీర్‌ను బోధన్‌కు వెళ్లేందుకు అనుమతించారు. ఆయన తల్లి అంత్యక్రియలు (funeral) అక్కడ నిర్వహించనున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఆయనకు విడుదల చేశారు. అనంతరం కేసు న్యాయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








