Sarkar Live

Formula e Car Race : కేటీఆర్‌కు చుక్కెదురు.. పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన హైకోర్టు

Formula e Car Race : భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. ఫార్ములా-ఈ రేస్ స్కాంలో అవినీతి నిరోధక సంస్థ‌ (ACB)

KTR

Formula e Car Race : భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. ఫార్ములా-ఈ రేస్ స్కాంలో అవినీతి నిరోధక సంస్థ‌ (ACB) ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన విష‌యం విదిత‌మే. ఈ కేసులో అరెస్టు చేయ‌కుండా త‌న‌కు వెసులుబాటు క‌ల్పించాల‌ని కోరుతూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం గ‌త‌ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధుల దుర్వినియోగం ఆరోపణల నేప‌థ్యంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు న‌మోదైంది. ఫార్ములా-ఈ రేస్‌లో రూ. 54.88 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. 2024 డిసెంబరు 19న ACB కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(A), 13(2), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 409, 120(B) సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో కేటీఆర్‌ను ఏసీబీ (Anti-Corruption Bureau ) అరెస్టు చేసే అవ‌కాశం ఉండ‌గా ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. అరెస్టు నుంచి త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అభ్య‌ర్థించారు. ఆయ‌న పిటిష‌న్‌ను న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది.

కోర్టు తీర్పు ప్రభావం

కేటీఆర్ పిటిష‌న్‌ను హైకోర్టు తిర‌స్క‌రించిన క్ర‌మంలో ACB కేసు కొనసాగనుంది. ఆయ‌న అరెస్టు అంశంలో ఇక ఎలాంటి వెసులుబాటు లేద‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా నెల‌కొంది. రాజ‌కీయ శిబిరంలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Formula e Car Race ఎందుకు?

ప్రపంచవ్యాప్తంగా హైద‌రాబాద్‌ నగరాన్ని ప్రచారం చేయడం, టూరిజం పెంపొందించడం, అంతర్జాతీయ ఈవెంట్‌లు ఆకర్షించడం ఫార్ములా-ఈ రేస్ ఈవెంట్ ముఖ్య లక్ష్యం. దీని కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 54.88 కోట్ల నిధులను ఖర్చు చేసింది. అయితే.. ఈ నిధులను అక్రమంగా వినియోగించిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కేటీఆర్ ఏమంటున్నారంటే..

తనపై వచ్చిన ఈ ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. రాజ‌కీయ దురుద్దేశంతోనే త‌న‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించాలనే లక్ష్యంతోనే ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించామ‌ని అంటున్నారు. ఈ కేసు ద్వారా తన ప్రతిష్టకు భంగం కలిగించాలని ప్ర‌త్య‌ర్థులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

స్కాంపై రాజకీయ ప్రభావం

ఫార్ములా-ఈ రేసు స్కాం (Formula e Car Race scam) , కేటీఆర్‌పై ఏసీబీ కేసు అంశాలు రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని వేడిక్కిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దీనిని ఆయుధంగా ఉప‌యోగిస్తున్నాయ‌ని తెలుస్తోంది. BRSపై దాడి చేసేందుకు ఈ పార్టీల‌కు ఒక అస్త్రంగా మారింది. అవినీతి కేసుల ద్వారా BRSపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నాయ‌ని తెలుస్తోంది. అయితే.. ఈ కేసు రాజకీయ ప్రతీకార చర్యగా క‌నిపిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసును ఎదుర్కొనేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?