Hyderabad : తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ (Foxconn) తన పరిశ్రమను హైదరాబాద్‌కు బదులుగా ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి డి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ త్వరలో రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభిస్తుందని మంగళవారం ప్రకటించారు.
మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు శ్రీధర్‌బాబు సమాధానమిస్తూ.. ఫాక్స్‌కాన్ సంస్థ హైదరాబాద్‌లో తన ఫెసిలిటీని ఏర్పాటు చేస్తుందని, ఇతర రాష్ట్రాలకు కంపెనీ మారనున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని అన్నారు. “ఫాక్స్‌కాన్‌కు బెంగళూరు, చెన్నై, గుజరాత్‌లలో బేస్ ఉంది. ఇది వివిధ ప్రదేశాలలో తన కార్యకలాపాలను విస్తరించుకోవాలని భావిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కూడా పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
త్వరలో Foxconn ప్రకటన
దీనికి సంబంధించి ఫాక్స్‌కాన్ త్వరలో ప్రకటన చేయనుందని పేర్కొన్న ఐటీ మంత్రి, రాష్ట్రంలో సంస్థను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అని సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జిసిసి) గురించి వ్యాఖ్యానిస్తూ, ప్రపంచ ప్రఖ్యా త హోటల్ చైన్ మారియట్ తన మొదటి జిసిసి కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంది. 300 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించింది. GCC ద్వారా 20,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..