Hyderabad | ప్రజాభవన్‌లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ( Free Bus scheme) పథకంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన “మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం” విజయవంతమవుతోందన్నారు.
అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన “మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు” అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు.
ఈసందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం RTCకి ఉచిత ప్రయాణం కోసం రూ.6500 కోట్లు చెల్లించిందని తెలిపారు. కొత్తగా 150 బస్సులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, త్వరలో మహిళా డ్రైవర్లకు నియామకాలు చేపడతామని తలెఇపారు. జంట నగరాల్లో 5000 EV ఆటోలు మహిళలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ “RTCకి ప్రాణం పోసింది మహాలక్ష్మి పథకమేనని, మహిళలు ఆత్మవిశ్వాసంతో బస్సెక్కే రోజులు వచ్చాయని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.