Gaddar film awards | టాలీవుడ్‌లో 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను
ప్రముఖ సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులపై మురళీమోహన్ ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదికి మూడు చిత్రాల చొప్పున ఉత్తమ సినిమాలకు అవార్డులను వెల్లడించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. వీటితోపాటు సినీ రంగానికి సేవలందించిన వారికి ఆరు ప్రత్యేక అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రజాకవి, కాళోజీ నారాయణరావుకు స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రకటించారు.
Gaddar film awards | సంవత్సరాల వారీగా ఉత్తమ చిత్రాలివే..
2014
ప్రథమ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్
రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల
మూడో ఉత్తమ చిత్రం : అల్లుడు శీను
2015
ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి
రెండో ఉత్తమ చిత్రం: కంచె
మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు
2016
ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి
రెండో ఉత్తమ చిత్రం: పెళ్ళి చూపులు
మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్
2017
ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2
రెండో ఉత్తమ చిత్రం: ఫిదా
మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ
2018
ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి
రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం
మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం
2019
ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి
రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ
మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం
2020
ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో..
రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో
మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలొడీస్
2021
ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్
రెండో ఉత్తమ చిత్రం: అఖండ
మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన
2022
ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం
రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2
మూడో ఉత్తమ చిత్రం: మేజర్
2023
ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం
రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్
మూడో ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.