Gajini 2 Movie Updates | ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థ అంటే గుర్తుకొచ్చే పేర్లలో గీతా ఆర్ట్స్ బ్యానర్ (Geetha arts Banner) కూడా ఒకటి. ఈ బ్యానర్ పై ఎన్నో సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. చాలా సినిమాలు మెగాస్టార్ తో తీసి బంపర్ హిట్ లు కొట్టినవి ఉన్నాయి.
కొంతకాలంగా ఈ నిర్మాణ సంస్థ నుండి నేరుగా సినిమాలు రావడం తగ్గిపోయింది. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్లతో సినిమాలు తెరకెక్కు తుండడంతో సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం ఎందుకని పెద్దగా రిస్క్ చేయడం లేదని తెలుస్తోంది. ఇంకో బడా నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కూడా మూవీలను తీయడం తగ్గించేసింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 2008 లో అమీర్ ఖాన్ (Ameer Khan) హీరోగా ఏఆర్ మురుగదాస్ (AR Murugadas) డైరెక్షన్లో గజినీ అనే మూవీ తెరకెక్కి హిందీలో మొదట 100 కోట్లు కొట్టిన మూవీగా చరిత్ర ఎక్కింది. తర్వాత 100 కోట్లు కొట్టిన సినిమాలు చాలానే వచ్చాయి. ఇప్పుడు 100 కోట్లు కాస్త వెయ్యి కోట్లుగా మారింది. మూవీ మంచి హిట్ అయితే వెయ్యి కోట్లు కూడా కలెక్షన్లు రాబడుతుంది. అంత భారీ బడ్జెట్లో మూవీస్ తెరకెక్కిఅంతే భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి.తేడా వస్తె మాత్రం అంతే సంగతి. అందుకే చాలా బ్యానర్లు సినిమా నిర్మాణాలకు దూరంగా ఉంటున్నాయి.
ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ నుండి తండెల్ అనే మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉండగా బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ ట్రైలర్ ని హిందీలో అమీర్ ఖాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగానే అల్లు అరవింద్ మాట్లాడుతూ గజినీ మూవీని అమీర్ ఖాన్ తో తెరకెక్కిస్తున్న టైం లో అమీర్ ఖాన్ ఈ మూవీ 100 కోట్లు కలెక్షన్లు సాధిస్తుందని ఛాలెంజ్ చేశారని చెప్పారు. అనుకున్నట్టుగానే ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే అమీర్ తో వెయ్యి కోట్ల మూవీని తీస్తానన్నారు.
Gajini 2 సినిమాపై జోరుగా ప్రచారం..
కొంతకాలంగా గజినీ-2 (Gajini 2) పై ప్రచారం జరుగుతూనే ఉంది.ఓ సందర్భంలో సూర్య కూడా గజినీ-2 మూవీ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా 1000 కోట్లు కొట్టే ఆ మూవీ గజినీ-2 అవ్వొచ్చు అన్నారు. దీన్నిబట్టి ఈ మూవీపై అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగానే తెలుస్తోంది. కాకపోతే కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.
అమీర్ ఖాన్ కు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి.. అలాగే గజినీ మూవీ డైరెక్టర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ సికిందర్ తో బిజీగా ఉన్నారు. వీరి మూవీస్ కంప్లీట్ చేశాక ఈ మూవీని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులో సూర్యతో (surya) ఈ మూవీని తెరకెక్కిస్తారు. చందు మొండేటి డైరెక్షన్లో నేరుగా తెలుగులో మూవీ చేయడానికి సూర్య రెడీ అవుతున్నారు. స్టోరీ కూడా లాక్ అయినట్టు టాలీవుడ్ టాక్. ఇలా చాలాకాలం నుండి స్ట్రైయిట్ తెలుగు సినిమా చేయాలనుకున్న సూర్య కల నెరవేరిపోతుంది. గజినీ మూవీ లవర్స్ మాత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. Gajini 2 మూవీ ఎప్పుడు వచ్చినా 1000 కోట్లు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..