Dhop Lyrical Song | జనవరి 10 న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ (Game Changer 2025) మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనక్కర్లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా కియరా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇప్పటికే అనేక రకాల ఈవెంట్ లు నిర్వహించింది. తాజాగా కొద్దిసేపటి క్రితమే గేమ్ ఛేంజర్ నుండి దోప్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో సగం ఇంగ్లీష్ తోపాటు సగం తెలుగు లిరిక్స్ ఉండడం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ () తనదైన శైలిలో కంపోజ్ చేయడం మెగా అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను మెప్పించినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Game Changer 2025 ఇప్పటికే కొన్ని రోజుల క్రితం విడుదలైన “నానా హైరానా”,”జరగండి జరగండి”, “రా మచ్చ” సాంగ్ లు రికార్డులు క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన “దోప్ సాంగ్” ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Game Changer 2025 | దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ దోప్ సాంగ్”