Tollywood News : తమిళంలో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా, భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయి కాసుల వర్షం కురిపిస్తుంటాయి. కానీ ఆయన నేరుగా తెలుగులో మొదటి సారిగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం గేమ్ చేంజర్ (Game Changer). పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఈనెల 10న గ్రాండ్ గా విడుదలవుతోంది.
నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మొదటి నుండి ఈ మూవీ పై నెగిటివిటీ తో ఉన్న ఫ్యాన్స్ ట్రైలర్ వచ్చాక ఫిదా అవుతున్నారు. రామ్ చరణ్ (Ram Charan) స్క్రీన్ ప్రజెన్స్, శంకర్ (shankar) మార్క్ మూవీపై అంచనాలను పెంచేసింది.
చరణ్ ఆర్ ఆర్ ఆర్ (RRR) తర్వాత వస్తున్న మూవీ కావడం తో ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ శంకర్ గత చిత్రం భారతీయుడు -2 (Bharatheeyudu-2) అట్టర్ ప్లాప్ కావడంతో కాస్త టెన్షన్ పడ్డారు. శంకర్ తనదైన టేకింగ్ చూపించడంతో పక్కా పొంగల్ బ్లాక్ బస్టర్ అని సంబర పడిపోతున్నారు.
మొదటి నుండి హడావిడి లేకుండా పాటలు, టీజర్, ట్రైలర్ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ నెల 4 న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసింది. కానీ కర్ణాటక లో మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ కోపంతో ఉన్నారు. మూవీ పోస్టర్ లపై కొందరు స్ప్రే కొట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] వినయ విదేయ రామ మూవీలోను, ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలోను కియరా అడ్వాని హీరోయిన్ […]