నిందితుల ఆటకట్టించిన వరంగల్ పోలీసులు
చూడటానికి ఉన్నత కుటుంబాలకు చెందినవారి కనిపిస్తూ గంజాయి (Ganja) రవాణాకు పాల్పడున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కిలాడీ దంపతులను మీల్స్‌కాలనీ, డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. ఈ ఘరానా దంపతుల నుంచి సుమారు 6 లక్షల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకేట్లతో పాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మీల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడించారు.
ఒడిశా (Odisha) రాష్ట్రానికి చెందిన గొగి శంకర్ దాస్ (39), పూర్ణిమ గొగిదాస్ (30) వీరూ ఇరువురు భార్యభర్తలు ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో నివాసం ఉంటున్నారు. కిలాడీ దంపతులు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిశా నుంచి తీసుకవచ్చి సూరత్‌లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసుకున్నారు. దీంతో నిందితులు గతంలో ఒడిశాలో పరిచయం వున్న ప్రదీప్ అనే గంజాయి స్మగ్లర్ల వద్ద ఈ దంపతులు గంజాయిని కోనుగొలు చేసి రహస్యంగా బ్యాగుల్లో భద్రపర్చి రైలు ద్వారా ముంబాయి మీదుగా సూరత్‌కు తరలించేవారు.
ఇదే తరహలో కిలాడీ దంపతులు పలుమార్లు గంజాయి (Ganja)ని సూరత్(Surat) కు తరలించారు. ఇదే తరహాలో నిందితులు ఈరోజు మధాహ్నం ముంబై-భవనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. పోలీసులకు పట్టుబడుతామనే భయంతో నిందితులు వరంగల్ రైల్వే స్టేషన్‌లో దిగి మరో మార్గంలో ముంబాయి వెళ్లేందుకు మూడవ ప్లాట్‌ఫారం నుంచి బయటికి పోయేందుకు యత్నిస్తుండగా అదే సమయంలో డ్రగ్స్ కంట్రోల్ టీంతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మీల్స్‌కాలనీ ఎస్‌ఐ సురేష్ నిందితులను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వీరిని తనీఖీ చేయగా బ్యాగుల్లో గంజాయిని గుర్తించిన పోలీసులు దంపతులను అరెస్టు చేసిన పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గంజాయిని తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని మిల్స్ కాలనీ పోలీసులు ఈ సందర్బంగా హెచ్చరించారు. డ్రగ్స్ లేదా గంజాయికి సంబంధించిన సమచారం ఏదైనా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
గంజాయి రవాణాకు పాల్పడున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కిలాడీ దంపతులను మీల్స్‌కాలనీ, డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. pic.twitter.com/PKZ4NaDclt
— Sarkarlive.net (@sarkarlivenews) February 14, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








