GATE-2025 : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ (GATE)-2025 అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్. ఈ
పరీక్షకు సంబంధించి అధికారిక అడ్మిట్ కార్డులు ఈ రోజు విడుదలవుతున్నాయి. అభ్యర్థులు ఈ హాల్ టికెట్‌ను gate2025.iitr.ac వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
GATE 2025 పరీక్ష వివరాలు
గేట్ పరీక్ష ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో దీన్ని చేపడతారు. మొత్తం నాలుగు రోజులపాటు రెండు సెషన్లుగా GATE పరీక్ష జరగనుంది.
- మొదటి సెషన్ : ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది
- రెండో సెషన్ : మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి : మొత్తం మూడు గంటలు ఉంటుంది. ప్రతి అభ్యర్థి తనకు కేటాయించిన సెషన్ ప్రకారం పరీక్ష రాయాల్సి ఉంటుంది.
GATE ప్రాముఖ్యత
GATE అనేది ఒక జాతీయ స్థాయి పరీక్ష. ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, ఆర్కిటెక్చర్, హ్యూమానిటీస్‌లలో మాస్టర్స్, డాక్టరల్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి GATE స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
ఉద్యోగావకాశాలు
ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) కూడా GATE స్కోర్ ఆధారంగా అభ్యర్థులను నియమిస్తాయి.
ఇది అభ్యర్థుల సాంకేతిక పరిజ్ఞానం, ప్రాథమికతను అంచనా వేయడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది.
పరీక్ష నమూనా
GATE 2025 పరీక్షలో ప్రతి పేపర్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం 15 మార్కులు, కోర్ సబ్జెక్ట్స్ 85 మార్కులు ఉంటాయి. ఈ పరీక్ష ప్రశ్నలు రెండు ప్రధాన విభాగాలుగా ఉంటాయి.
- మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. వీటికి తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కులు ఉంటాయి. 2. మల్టిపుల్-సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు: వీటికి నెగటివ్ మార్కులు ఉండవు.
GATE నిర్వహణ
- ఈ పరీక్షను నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు (NCB), హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ (MoE), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
- గేట్ పరీక్షను ఏడు IITలు నిర్వహిస్తున్నాయి. IIT బాంబే, IIT ఢిల్లీ, IIT గౌహతి, IIT కాన్పూర్, IIT ఖరగ్‌పూర్, IIT మద్రాస్, IIT రూర్కీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
GATE 2025 అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac లోకి వెళ్లండి - లింక్‌పై క్లిక్ చేయండి:
హోం పేజ్‌లో కనిపించే GATE 2025 Admit Card అనే లింక్‌పై క్లిక్ చేయండి. - లాగిన్ వివరాలు నమోదు చేయండి:
కొత్త పేజీ ఓపెన్ అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి. - అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి:
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. - పరీక్ష రోజు ఈ హాల్ టికెట్‌ను తీసుకెళ్లండి:
పరీక్షకు హాజరయ్యేటప్పుడు హాల్ టికెట్‌ను వెంట తీసుకెళ్లడం తప్పనిసరి.
అభ్యర్థులకు సూచనలు
GATE 2025 పరీక్షకు హాజరవుతున్న ప్రతి అభ్యర్థి ఈ ముఖ్యమైన సూచనలను గుర్తుంచుకోవాలి:
- ఆధార్‌కార్డుతో పాటు హాల్ టికెట్‌ను తీసుకెళ్లాలి.
- నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- నిబంధనలు, మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి.
- పరీక్షకు ముందు ప్రశ్నాపత్రం, సూచనలను సవివరంగా చదవాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..