GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడి నుంచో తిరుగుతూ మనదేశంలోనూ ఇది విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక మహమ్మారుల బారిన పడి ముప్పు తిప్పలు పడిన భారతీయులను కొత్తగా ఈ గులియన్-బారే సిండ్రోమ్ వ్యాధి కలవరపెడుతోంది.
పెరుగుతున్న GBS కేసులు
GBS Syndrome Causes : ఈ గులియన్-బారే సిండ్రోమ్ కేసులు మన భారతదేశంలో పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అక్కడి వైద్యులు ప్రకటించారు. మహారాష్ట్ర (Maharashtra)లో గులియన్-బారే సిండ్రోమ్‌తో మరణించిన తొలి కేసుగా ఇది నమోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జీబీఎస్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 101కి చేరింది. వీరిలో 28 మందికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయ్యింది. పూణేలో 16 మంది రోగులు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 9 ఏళ్లలోపు చిన్నారులు 19 మంది, 50-80 సంవత్సరాల మధ్య వయసు గల వారు 23 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.
GBS Syndrome .. ఆందోళనకర పరిస్థితులు
జీబీఎస్ వ్యాధి ప్రధానంగా నరాలను దెబ్బతీసే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను ఇన్‌ఫెక్ట్ చేస్తుంది. సాధారణంగా కలుషిత ఆహారం లేదా నీటిలో నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. నరాల బలహీనత, పక్షవాతం, శరీర భాగాలు చలనం లేకుండా పడిపోవడం వెన్నునొప్పి లేదా కండరాల నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం ( ఇది గుండె స్పందన, రక్తపోటు వంటి శరీర స్వీయ నియంత్రణలపై ప్రభావం చూపుతుంది) ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. బాధితుల్లో 80% మంది 6 నెలలలోపు కోలుకుంటారు. కానీ కొందరికి పూర్తిగా కోలుకోవడానికి ఏడాది వరకు పడొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
GBS వ్యాధికి ఖరీదైన చికిత్స
GBS syndrome Prevention : జీబీఎస్ వ్యాధి చికిత్స చాలా ఖరీదైనది. ఒక్క ఇంజెక్షన్‌కు సుమారు రూ.20 వేలు ఖర్చవుతుంది. పూణేలో ఇప్పటికే చాలా మంది రోగులు ప్రధాన ఆస్పత్రుల్లో ఈ చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ ఈ వ్యాధి బారిన పడిన రోగులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రకటించారు. జిల్లా యంత్రాంగం, మునిసిపల్ కార్పొరేషన్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..