Sarkar Live

Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?

Ghaati movie review : వేదం మూవీ తరవాత క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన మూవీ ఘాటి(ghati). గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ గా మూవీని తీశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా

Ghaati movie review

Ghaati movie review : వేదం మూవీ తరవాత క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన మూవీ ఘాటి(ghati). గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ గా మూవీని తీశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం….

స్టోరీ..

కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్), కుందుల నాయుడు(చైతన్య రావు)గంజాయి స్మగ్లింగ్ చేయిస్తుంటారు. వారి కింద దేశీ రాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క) గంజాయి స్మగ్లింగ్ పని చేయడానికి వెళ్తారు. వారి ఆ వృత్తిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? వెళ్ళాకా జరిగిన పరిణామాలు ఏంటి..?ఆ తర్వాత ఏం జరిగింది..?అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే…

మూవీ ఎలా ఉందంటే..

అనుష్క క్రిష్ కాంబో అంటే ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన వేదం సూపర్ హిట్టు అయిన విషయం తెలిసిందే.కానీ వీరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మాత్రం అందుకోలేకపోయారని అనిపించింది. స్టోరీ కొద్దిగా కొత్తగా అనిపించినా.. రొటీన్ గా సాగే కథనం ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ లో క్యారెక్టర్ లను పరిచయం చేయడం లో లేట్ చేసిన డైరెక్టర్.. కథలోకి నెమ్మదిగా వచ్చాడనిపించింది. అక్కడి నుండి క్రిష్ తనదైన మార్క్ టేకింగ్ తో తీసుకెళ్ళాడు. ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సీన్స్ తో బాగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి.అదే ఊపులో సెకండాఫ్ ఓ రేంజ్ లో ఉంటుందనుకున్న ప్రేక్షకుడికి కొద్దిగా బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ ముందు అదిరిపోతుంది. ఫస్టాప్ ఉన్నంతగా సెకండాఫ్ క్రిష్ టేకింగ్ లేకపోవడం మైనస్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా అనుష్క క్రిష్ కాంబో మరింతగా మెప్పించి ఉంటే బాగుండేది అనిపించింది. Ghaati movie review

Ghaati movie review : నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

డైరెక్టర్ క్రిష్ నుండి మూవీ వచ్చి చాలా ఏళ్ళయింది. తను హిట్టు కొట్టి కూడా చాలా కాలమే అయిపోయింది. హిట్టు కోసం బరిలో దిగిన క్రిష్ అనుకున్నట్టుగానే తనదైన మార్క్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫస్టాప్ సూపర్ థ్రిల్ గా తీసిన క్రిష్… సెకండాఫ్ లో పట్టు కోల్పోయాడనిపించింది. మరింతగా దృష్టి పెట్టుంటే బ్లాక్ బస్టర్ అందుకునేవాడనిపించింది.ఇక
చాలా రోజుల తరవాత అనుష్క మూవీ రిలీజ్ అయింది. ఆడియన్స్ తన మూవీ నుండి చాలా ఆశిస్తారు. దానికి తగ్గట్టుగానే మూవీలో శీలావతి గా అనుష్క తన నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుందని చెప్పొచ్చు. మరింత పవర్ ఫుల్ గా తన క్యారెక్టర్ ను డిజైన్ చేసుంటే తన కెరీర్ లో మరో గుర్తుండిపోయే పాత్ర అయ్యేది.దేశిరాజు క్యారెక్టర్ లో విక్రమ్ ప్రభు అదరగొట్టాడు. తన పాత్రకు ఆడియన్స్ నుండి మంచి మార్కులే పడుతాయి. జగపతి బాబు పాత్ర కూడా పర్వాలేదని అనిపించినా.. ఇంకా బలంగా తన క్యారెక్టర్ ను రాసుంటే బాగుండే దనిపించింది. రవీంద్ర విజయ్, చైతన్య రావు విలన్ గా ఆకట్టుకున్నారు. లారిసా బో నేసి, జాన్ విజయ్, తదితరులు వారి వారి పాత్రల మేరకు బాగానే యాక్ట్ చేశారు.మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవల్లి సాంగ్స్ ఆకట్టుకోలేదు. బిజీఎం కూడా సో సో గానే ఉండడం మూవీకి కొద్దిగా మైనస్ గా మారిందని చెప్పొచ్చు. కొన్ని కొన్ని సీన్స్ లో బీజీఎం కరెక్ట్ గా పడుంటే నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ అయ్యేవనిపించింది. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ బాగున్నాయి. ఓవరాల్ గా క్రిష్ ఘాటి ఫ్లాఫ్ నుండి గట్టెక్కిన బ్లాక్ బస్టర్ అందుకోవడం అనుమానం అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్..

  • స్టోరీ
  • క్రిష్ టేకింగ్
  • అనుష్క, విక్రమ్ ప్రభు యాక్టింగ్
  • ఫస్టాప్

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్
  • మ్యూజిక్

రేటింగ్

2.5/5


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?