Gondia- Balharshah railway line : మహారాష్ట్రలోని గోండియా-బల్హర్షా రైల్వే లైన్ పై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ మార్గంలో కొత్తగా డబ్లింగ్ పనులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. దీని పొడవు 240 కిలోమీటర్లు. దీని ఖర్చు రూ. 4,819 కోట్లు. ఈ ప్రాజెక్ట్ తో ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా సరుకు రవాణా కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది.
Balharshah railway line : రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ పనులు
“మహారాష్ట్రలోని 240 కి.మీ. గోండియా-బల్హర్షా రైల్వే లైన్ (Gondia – Balharshah railway line )ను రూ. 4,819 కోట్లతో డబ్లింగ్ చేయడానికి ప్రధానమంత్రి ఇటీవల ఆమోదం తెలిపారు. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణీకులకు రైల్వే సేవలతోపాటు సరుకు రవాణా అనుసంధానాన్నిపెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది… ఈ ప్రాంతంలోని జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి” అని వైష్ణవ్ మీడియాతో అన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌తో సహా మహారాష్ట్ర రూ. 1.73 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను అందుకుందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, మహారాష్ట్రకు రైల్వే మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌తో సహా మహారాష్ట్రకు రూ.1.73 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే, రాష్ట్రానికి రూ. 23,000 కోట్లకు పైగా కేటాయించాం” అని రైల్వే మంత్రి అన్నారు.
ఆమోదించిన ప్రాజెక్టులో సమగ్రమైన అప్‌గ్రేడ్‌లు ఉన్నాయని, , వీటిలో ప్రస్తుత ట్రాక్ 240 కి.మీ.ల రెట్టింపు, 29 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఉన్నాయని పేర్కొన్నారు. . ” రైల్వే కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, భద్రతను పెంచడానికి 36 ప్రధాన వంతెనలు, 338 చిన్న వంతెనలు, 67 రోడ్ అండర్ బ్రిడ్జిలు (RUBలు) నిర్మాణం చేపడుతున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








