Sarkar Live

ASHA Workers | ఆశా కార్యకర్తలకు వరాలు గ్రాట్యుటీ, ఇత‌ర సౌక‌ర్యాలు

Good News for ASHA Workers : ఆశా కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu) శుభ‌వార్త చెప్పారు. వారికి గ్రాడ్యుటీ (gratuity) చెల్లింపు సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు..

ASHA Workers

Good News for ASHA Workers : ఆశా కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu) శుభ‌వార్త చెప్పారు. వారికి గ్రాడ్యుటీ (gratuity) చెల్లింపు సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు.. వీరికి ప్ర‌సూతి సెల‌వుల (maternity leave)ను పెంచడం, రిటైర్మెంట్ (retirement ) వ‌య‌సును పొడించ‌డం లాంటి నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. ఆశా కార్య‌క‌ర్త‌ల సేవ‌లు అత్యంత కీల‌క‌మ‌ని, వారి సంక్షేమాన్ని మెరుగుప‌ర్చ‌డం త‌మ బాధ్య‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా 42,752 ఆశా కార్యకర్తలకు ప్ర‌యోజ‌నం

ఆశా కార్యకర్తలు (Accredited Social Health Activists – ASHA) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువులతోపాటు వైద్య సేవల అవసరం ఉన్న ప్రజలకు వీరు అందుబాటు ఉంటారు. ఆశా కార్యకర్తలకు గ్రాడ్యుటీ అందించే ప్రణాళికకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆమోదం తెలిపారు. “ఇది 30 సంవత్సరాల పాటు సేవ చేసే ప్రతి ఆశా కార్యకర్తకూ రూ. 1.50 లక్షల రిటైర్మెంట్‌ ప్రోత్సాహకాన్ని అందజేయడంతో సమానం” అని ఏపీ ప్ర‌భుత్వం అధికారిక ప్రకటన పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 42,752 ఆశా కార్యకర్తలు ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు. ఇది ఆశా కార్యకర్తలకు ఆర్థిక భద్రతను కల్పించడమే కాకుండా, వారి సేవలకు గౌరవాన్ని అందించడానికి ముఖ్యమైన అడుగు అని ప్ర‌భుత్వం పేర్కొంది.

Good News for ASHA Workers : ప్ర‌సూతి సెల‌వుల పొడ‌గింపు

ఇదే కాకుండా ఆశా కార్యకర్తల (ASHA Workers) కోసం చెల్లింపు ప్రసూతి సెలవులను పొడిగించే నిర్ణయాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. అర్హత గల ఆరోగ్య కార్యకర్తల మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజుల చెల్లింపు ప్రసూతి సెలవులను మంజూరు చేశారు. ఇది మహిళా ఆశా కార్యకర్తలకు ఎంతో మేలుచేసే విధంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యాన్ని కాపాడటానికి, శిశువుకు తగిన సంరక్షణ అందించేందుకు ఇది చాలా అవసరం. ప్రస్తుతం మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు అందించే విధానం మరింత సమర్థంగా అమలవుతున్నప్పటికీ ఆశా కార్యకర్తలు కూడా ఇలాంటి ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వ క‌ల్పిస్తోంది.

రిటైర్మెంట్ వ‌య‌సు కూడా పెంపు

ఆశా కార్యకర్తల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ (increase of retirement age) కూడా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆమోద ముద్ర వేశారు. ఇది ఆశా కార్యకర్తలకు రెండు అదనపు సంవత్సరాల పాటు ఉద్యోగ భద్రతను అందిస్తుంది. ఆశా కార్యకర్తలు తమ అనుభవంతో మరింత కాలం సేవలు అందించగలుగుతారు. దీని ద్వారా గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మరింత మెరుగుపడే అవకాశముంది. ఈ కీలక నిర్ణయాల ద్వారా ఆశా కార్యకర్తల హక్కులను పరిరక్షించడమే కాకుండా, వారికి మరింత మద్దతునిచ్చే విధంగా కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?