Google Ai : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై గూగుల్ (Google) మరింత దృష్టిని కేంద్రీకరించింది. జెమినీ 2.0, విలో లాంటి ప్రాజెక్టుల విజయాల తర్వాత మరింత ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయి (Google CEO Sundar Pichai) తమ లక్ష్యాలను వెల్లడించారు. 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై గూగుల్ దృష్టి కేంద్రీకరించిందని ఆయన తెలిపారు. 2024లో ఆర్టిఫిషియల్ రంగం సాధించిన విజయాల నేపథ్యంలో గూగుల్ 2025లో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించిందని సుందర్ పిచాయి వివరించారు.
మరింత కొత్తగా Google Ai
గూగుల్ సాధించిన విజయాలు అనేక ఉన్నా.. 2024లో తమ ఖాతాలో మరిన్ని వచ్చి చేరాయని సుందర్ పిచాయి తెలిపారు. సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్, ఆండ్రాయిడ్, పిక్సెల్ వంటి విభాగాల్లో AI ద్వారా సాధించిన ప్రగతిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విజయాలు 2025లో కూడా కొనసాగుతాయన్నారు. గూగుల్‌లో కొత్త ఉత్పత్తులు, ఫీచర్లు వచ్చే నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు.
పలుమార్లు సమీక్ష
గూగుల్‌లో కొత్తగా రాబోయే ఫీచర్లు, ప్రొడక్టవిటీ గురించి ఇప్పటికే తమ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశామని పిచాయి చెప్పారు. ఈ అంశాలపై పలుమార్లు సమీక్షించామని కూడా తెలిపారు. గూగుల్ నిర్వహించే I/O సమ్మిట్‌లో ఈ ఫీచర్లు, ప్రొడక్ట్‌లను లాంచ్ చేయనున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు.
గూగుల్ కొత్త ప్రణాళికల్లో ముఖ్యమైనవి..
- జెమినీ 2.0 ఫ్లాష్‌ను డెవలపర్లకు జనవరి చివరిలో అందుబాటులోకి తీసుకురావడం.
- గూగుల్ సేవలన్నింటిలో జెమినీ 2.0ను మరింత అనుసంధానం చేయడం.
- నోట్‌బుక్ LM ప్లస్‌ను 2025 ప్రారంభంలో గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్లకు అందించడం.
- సెర్చ్‌లో AI అవర్‌వ్యూస్‌ను విస్తరించడం.
గూగుల్‌లో వ్యక్తిగత ఫీచర్లు, కొత్త టూల్స్
- గూగుల్ ఇటీవల డైలీ లిసన్ అనే వ్యక్తిగత పొడ్‌కాస్ట్ ఫీచర్‌ను సెర్చ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షించడం ప్రారంభించింది. ఇది వినియోగదారుల విజయగాథలు, టాపిక్స్‌ను అనుకూలంగా అందించే టూల్.
- జెమినీ 2.0 ఫ్లాష్ .. ఎక్స్‌పెరిమెంటల్ స్టేటస్ నుంచి ముందుకెళ్లి మరిన్ని ఫీచర్లతో పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి రానుంది. ప్రత్యర్థుల పోటీతోపాటు నియంత్రణ సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నంలో గూగుల్ కొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. AI ప్రయాణంలో కీలక సంవత్సరం
2025ను Google Ai అభివృద్ధి ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన సంవత్సరంగా పిచాయ్ అభివర్ణించారు. ప్రాపంచిక సమస్యల పరిష్కారానికి టెక్నాలజీని ఉపయోగించే దిశగా దృష్టి పెట్టాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గతంలో జరిగిన దక్షిణ కాలిఫోర్నియాలోని అడవి ప్రమాదాల ప్రభావం వంటి అంశాలకూ ఆయన ప్రస్తావించారు. ఈ సంఘటనల దృష్ట్యా వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే కొత్త పద్ధతులను సృష్టించడంలో AI సాయపడగలదని పిచాయ్ అభిప్రాయపడ్డారు.
గూగుల్ లక్ష్యాలు
AI పట్ల గూగుల్ దృక్పథం స్పష్టంగా ఉంది. అన్ని విభాగాల్లో AI ను మరింత ఉపయోగించుకునేలా చేసే దిశగా పిచాయ్ దృష్టి పెట్టారు. 2025లో కొత్త ప్రణాళికలు, ఫీచర్లు, సేవలతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి గూగుల్ సిద్ధమవుతోంది. జెమినీ 2.0, డైలీ లిసన్, AI అవర్‌వ్యూస్ వంటి తాజా ఫీచర్లతో గూగుల్ తన వినియోగదారులకు అనుభవాలను మరింత వ్యక్తిగతీకరించిన దిశగా అడుగులు వేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..