Google time travel feature : ప్రపంచవ్యాప్తంగా నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఓ ప్రాంతం 10-20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే పాత ఫొటోలు లేదా పుస్తకాలను చూసి ఊహించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) కొత్త ‘టైమ్ ట్రావెల్’ (time travel) ఫీచర్ ద్వారా ఆ ప్రాంతం గతంలో ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూడొచ్చు (showing old images of streets, buildings and cities).
Google time travel feature : ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం:
- గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్ (Google Earth) ఓపెన్ చేయాలి.
- మీరు చూడాలనుకున్న ప్రదేశాన్ని సెర్చ్ (search) చేయాలి.
- లేయర్స్ (Layers) ఆప్షన్ క్లిక్ చేసి ‘టైమ్ లాప్స్’ (time lapse)సెలెక్ట్ చేయాలి.
- గత దశాబ్దాల్లో ఆ ప్రదేశం ఎలా మారిందో చూడొచ్చు.
ఈ ఫీచర్ ద్వారా మీరు పాత వీధులు, భవనాలు, ప్రకృతి మార్పులు, నగర అభివృద్ధి మొదలైన అంశాలను స్పష్టంగా చూడొచ్చు.
గతాన్ని కళ్ల ముందుంచే అద్భుత ఫీచర్
ఈ ‘టైమ్ ట్రావెల్’ ఫీచర్ 1930 నుంచి ఇప్పటి వరకు తీసిన ఫొటోలను ఉపయోగించి ఒక ప్రదేశం కాలక్రమంలో ఎలా మారిందో చూపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లోని నగరాలకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.
Google time travel feature : ప్రధానంగా ఏం చూడొచ్చంటే..
- పాత రహదారులు, వీధుల ((Street View) మార్పులు
- కొత్త భవనాల నిర్మాణం, పురాతన భవనాల కూల్చివేత
- పర్యావరణ మార్పులు – చెట్ల పెరుగుదల లేదా తరిగిపోవడం
- ప్రముఖ చారిత్రక ప్రదేశాల రూపాంతరం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ (Real Estate) మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త రోడ్లు, బ్రిడ్జిలు, మల్టీ స్టోరీ భవనాలు వస్తుండటంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (infrastructure) చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ఈ ఫీచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భవిష్యత్తులో ఇల్లు కొనాలనుకునేవారికి చాలా ఉపయోగకరం.
ఒక ప్రాంతం గతంలో ఎలా ఉండేదో చూసి భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాలా వద్దా ? అన్నది నిర్ణయించుకోవచ్చు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించొచ్చు. పాత భవనాలు కొనుగోలు చేయాలా? లేదంటే కొత్త భవనాల కోసం వెతకాలా? అన్న విషయాన్ని దీనిబట్టి నిర్ణయించొచ్చు.
స్ట్రీట్ వ్యూ అప్‌డేట్ – మరింత స్పష్టమైన దృశ్యాలు
గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ (Street View) ఫీచర్‌ను కూడా మరింత అప్‌డేట్ చేసింది. 280 బిలియన్‌కి పైగా ఫోటోలు అప్‌లోడ్ చేసింది. హై క్వాలిటీ కెమెరాలతో గూగుల్ కార్లు, డ్రోన్లు, ట్రాకర్స్ ద్వారా కొత్తగా ఫొటోలు తీసింది. ప్రతి ప్రాంతాన్ని మరింత స్పష్టంగా చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
Google time travel feature : ఎవరికి ఉపయోగపడుతుంది?
- చరిత్ర అభిమానులు- గతంలో ఒక ప్రాంతం ఎలా ఉండేదో చూసి విశ్లేషించొచ్చు.
- ప్రయాణికులు, పర్యాటకులు – ఒక పర్యాటక స్థలం గతంలో ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు.
- రియల్ ఎస్టేట్ వ్యాపారులు – భవిష్యత్తులో పెట్టుబడి అవకాశాలను తెలుసుకోవచ్చు.
- పట్టణ అభివృద్ధి నిపుణులు, ఆర్కిటెక్ట్స్ – నగర నిర్మాణ వ్యూహాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విస్తరణ
ప్రస్తుతం గూగుల్ ఈ ఫీచర్‌ను అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో కొన్ని ప్రముఖ నగరాలకు అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్తులో ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు, పట్టణాలకు, గ్రామాలకు కూడా ఈ ఫీచర్ వచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..