Google to enhance traffic | హైదరాబాద్ నగరం ట్రాఫిక్‌ను అత్యుధునిక టెక్నాలజీతో నియంత్రించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ సమయంలో కంట్రోల్ అయ్యేలా సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టనుంది. గూగుల్ ఇండియాతో కలిసి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించనుంది. ఇందుకు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ cutting-edge టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
ఓ విప్లవాత్మక మార్పు
తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణకు ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. Google Maps, AI, Drone సర్వైలెన్స్, Cloud Storage లాంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) ను సందర్శించింది. గూగుల్ ప్రస్తుత ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న DeepMind, Google Cloud, Google Customer Solutions వంటి విభాగాల నుంచి నిపుణులు హైదరాబాద్‌కు వచ్చి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచే మార్గాలను పరిశీలించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం (MoU) జరిగింది. దీని ద్వారా టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు.
ట్రాఫిక్ కంట్రోల్.. ఎలా చేస్తారంటే..
Google Maps డేటాతో రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్
- లైవ్ ట్రాఫిక్ డేటా ఉపయోగించి అధిక ట్రాఫిక్ ఉన్న రహదారులను ముందుగానే గుర్తించడం
- ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం
ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ మేనేజ్‌మెంట్:
- ట్రాఫిక్ తీవ్రతను బట్టి ఆటోమేటిక్‌గా సిగ్నల్స్‌ను మార్చడం
- క్యూలెన్త్, వెహికల్ డెన్సిటీని గుర్తించి, టైమింగ్‌ను సర్దుబాటు చేయడం
పెట్రోలింగ్ వాహనాల ట్రాకింగ్:
- పోలీస్ వాహనాలను Google Maps ద్వారా ట్రాక్ చేయడం
- అత్యవసర పరిస్థితుల్లో పోలీసు వాహనాల వేగాన్ని పెంచేందుకు మార్గదర్శకాలను అందించడం
డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా Google ట్రాఫిక్ మానిటరింగ్:
- అత్యంత రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ పరిస్థితిని నిరంతరం గమనించడం
- అనుకోని అడ్డంకులు, ప్రమాదాలను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవడం
క్లౌడ్-బేస్డ్ డేటా స్టోరేజ్ & AI-powered CCTV రిట్రీవల్:
- ట్రాఫిక్ కెమెరాల ద్వారా సేకరించిన డేటాను క్లౌడ్‌లో భద్రపరచడం
- AI సాయంతో సీసీటీవీ ఫుటేజీని వేగంగా రిట్రీవ్ చేయడం Google to enhance traffic .. ప్రయోజనాలు
- సమయాన్ని ఆదా చేయడం: రద్దీ తగ్గించడం వల్ల పరిమిత సమయంతో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం కలుగుతుంది. ఇది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
-ప్రయాణ ఖర్చులు తగ్గించడం: ట్రాఫిక్ జామ్ వల్ల ఇంధన వ్యయం పెరుగుతుంది. దీనిని నియంత్రించడంలో ఈ టెక్నాలజీలు ఉపయోగపడతాయి. - ప్రమాదాలను తగ్గించడం: స్మార్ట్ ట్రాఫిక్ లైట్లు, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది.
- పోలీసుల పని భారాన్ని తగ్గించడం: ట్రాఫిక్ మానిటరింగ్ సులభం కావడంతో పోలీసులు ఇతర అత్యవసర సేవలకు మరింత సమయం కేటాయించగలుగుతారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..