- ఆర్టీఓలు లేకపోవడంతో రవాణా శాఖ గాడితప్పుతున్నదా?
- రాష్ట్రంలో సగానికి పైగా రవాణా శాఖ కార్యాలయాల్లో “ఆర్టీఓ”ల కొరత
- ఆర్టీఓ లను నియమించేదెన్నడు..? ఈ శాఖను గాడిలో పెట్టేదెప్పుడు..
రవాణా శాఖ (Telangana Transport Department) లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI)లు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో ఆర్టీఓ ల కొరత కారణంగా ఒక్కో అధికారి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో సగానికి పైగా “ఆర్టీఓ”లు లేరని దాంతో కార్యాలయాల్లోని ఎంవీఐ లకే “డిటివో” లుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఎంవీఐ లకు అదనపు భారం పడుతున్నట్లు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాపోతున్నారు.కొంతమంది ఇలా భాధపడితే మరికొంతమంది ఇదే అదునుగా డబుల్ బొనాంజా( ఎంవీఐ కమ్ డిటివో ప్రకారం రోజు వారి అక్రమ వసూళ్లు) పొందుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కొద్దిరోజుల్లోనే “ఓడి” లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ఆర్టీఓ లను నియమించాలని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
MVI Duties : రవాణా శాఖ ఆదాయంపై ప్రభావం..
జిల్లా రవాణాశాఖ కార్యాలయాల్లో ఆర్టీఓ లు లేకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాహనాల త్రైమాసిక పన్ను సక్రమంగా వసూళ్లు చేయాలంటే ఆర్టీఓ ల పర్యవేక్షణ తప్పనిసరి అని తెలుస్తోంది. అదే సమయంలో ఆర్టీవో లేక జిల్లా కార్యాలయంలో ఉన్న ఎంవీఐల కే డిటివో గా అదనపు బాధ్యతలు అప్పగించడంతో రెండు పోస్టులకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించడం వల్ల సమయం సరిపోక వాహనాల త్రైమాసిక పన్నులు కొన్ని జిల్లాల్లో పూర్తిగా వసూళ్లు కావడంలేదని సమాచారం.అంతేకాకుండా జిల్లా కార్యాలయాల్లో ఆర్టీఓ లు లేక కింది స్థాయి సిబ్బంది విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడడంతో ఏసీబీ అధికారు తనిఖీల్లో వరుసగా పట్టుబడుతూ రవాణా శాఖ అబాసుపాలవుతుందని కొంతమంది ఉద్యోగులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీఓ లను నియమించి రవాణా శాఖ ను గాడిలో పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆర్టీఓ లను నియమిస్తారో లేదో చూడాల్సిందే…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.