Sarkar Live

నిరుపేదలకు పండుగే.. స‌న్న బియ్యం పంపిణీ షురూ.. | Fine Rice Distribution

Fine Rice Distribution : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) పేదల ఆహార భద్రత (Food Security for the Poor)ను మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్‌కార్డు White Ration Card కలిగిన

Fine Rice Distribution

Fine Rice Distribution : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) పేదల ఆహార భద్రత (Food Security for the Poor)ను మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్‌కార్డు White Ration Card కలిగిన దారిద్య్రా రేఖకు దిగువన (Below Poverty Line (BPL) ఉన్న కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ (Fine Rice Distribution)కి శ్రీకారం చుట్టింది. త‌ద్వారా 85 శాతం రాష్ట్ర పేద ప్రజలు లబ్ధి పొందనున్నట్లు అధికారులు తెలిపారు.

Fine Rice Distribution : ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త మార్పులు

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వాలు పంపిణీ చేసిన బియ్యంలో తక్కువ నాణ్యత ఉన్నట్లు పలువురు ఆరోపించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో స‌న్న బియ్యం పంపిణీ (Fine Rice Distribution) మంగళవారం నుంచి ప్రారంభించింది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల స‌న్న బియ్యం బియ్యం పంపిణీ ఇక్క‌డ వాయిదా ప‌డింది. ఈ పథకంలో భాగంగా దారిద్య్రా రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబ సభ్యుడికీ నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్నారు. ఇది ఇప్పటికే 17,500 పైగా చౌక ధరల దుకాణాల (Fair Price Shops)కు సరఫరా పూర్తయినట్లు పౌర సరఫరాల శాఖ (Civil Supplies Department) అధికారులు తెలిపారు.

అక్రమాలకు చెక్!

గతంలో రేషన్ షాపుల్లో అక్రమాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో బియ్యం సరఫరా (Rice Distribution) వ్యవస్థలో అవినీతి కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈసారి కఠిన నియంత్రణలు అమలు చేయాలని నిర్ణయించారు. సన్న బియ్యం నిల్వలపై ప్రత్యేకంగా రిజిస్టర్ నిర్వహించాలని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కొత్త రేషన్ కార్డుల జారీ

ప్రస్తుతం రాష్ట్రంలో 2.85 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం దరఖాస్తులు పెరిగాయి. దాదాపు 30 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం ఈ సంఖ్య 3.10 కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!