- చూపించేది ఓ సర్వే నెంబర్ .. ప్రహారీ నిర్మించింది ప్రభుత్వ భూమిలో..
- కోటి విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేసిన కాంట్రాక్టర్ ..
Govt land Occupation : ప్రభుత్వ భూమిని తన వశం చేసుకునేందుకు ఓ కాంట్రాక్టర్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1 కోటి కి పైగా విలువ చేసే ఆ భూమిని దక్కించుకునేందుకు అతను వేసిన స్కెచ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందేనట. ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఆ భూమి ఉండటం, అక్కడ భూముల రేటు కోట్లల్లో ఉండటంతో సదరు వ్యక్తి కన్ను ఆ భూమిపై పడినట్లు సమాచారం.
సదరు కాంట్రాక్టర్ తనకున్న పలుకుబడితో ఆ భూమిలో ప్రహారీ నిర్మించి రెవెన్యూ అధికారులను సైతం అటువైపు చూడకుండా ఆమ్యామ్యాలతో మేనేజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 516 సర్వే నెంబర్ లోని 10 గుంటల భూమిని ఓ కాంట్రాక్టర్ చదును చేసి ప్రహరీని కూడా కట్టినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయితున్నప్పటికి స్థానిక రెవెన్యూ అధికారులు తమకేంపట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.
Govt land Occupation : స్కెచ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే…
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ఓ కాంట్రాక్టర్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు. ఈ భూమినే ఆనుకొని ఉన్న పక్క సర్వే నెంబర్ లోని 10 గుంటల భూమిని నాలా కన్వర్షన్ చేపించి ప్రభుత్వ భూమినే పట్టా భూమిగా చూపిస్తూ అందులో ప్రహారీ నిర్మించడం ఇప్పుడు ఆ గ్రామంలో చర్చనీయాంశం అయింది.
Govt land Occupation : వాస్తవానికి వంగపహాడ్ లోని 613 సర్వే నెంబర్ లో 1.26 గుంటల భూమి రికార్డు ప్రకారం ఉంటుంది. కానీ పొజిషన్ లో మాత్రం 1.10 గుంటల భూమి మాత్రమే ఉంటుంది దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు కాంట్రాక్టర్ 613 సర్వే నెంబర్ లో ఉన్న పట్టాదారుకు నయానో బయానో మచ్చిక చేసుకొని అతని పేరు మీద ఆ 10 గుంటల భూమిని నాలా కన్వర్షన్ చేపించి 516 సర్వే నెంబర్ లోని 10 గుంటల భూమిని ఆక్రమించుకునేందుకు వ్యూహం రచించి ప్రభుత్వ భూమిలో ప్రహారీ నిర్మించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు సదరు కాంట్రాక్టర్ వేసిన స్కెచ్ సక్సెస్ అయితుందో లేదో చూడాల్సిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.