Pod taxi in Hyderabad : రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో తరచుగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలికేందుకు కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుసాగుతోంది. నాలెడ్జ్ సిటీ, హైటెక్ సిటీ, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ (PRT) లేదా పాడ్ ట్యాక్సీ వ్యవస్థను (Pod taxi System) ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
పీఆర్‌టీ వ్యవస్థ మొదట్లో రెండు కారిడార్‌లలో రానుంది. మెట్రో స్టేషన్‌లను కీలక కార్యాలయ కేంద్రాలు, బహుళజాతి కంపెనీలు, రాయదుర్గ్, మాదాపూర్, కొండాపూర్ సమీప ప్రాంతాల్లోని భారీ భవనాలతో కలుపుతుంది. 28 స్టాప్‌లతో 8.8 కి.మీ పొడవైన కారిడార్-I రాయదుర్గ్- ఐటీసీ కోహెనూర్-నాలెడ్జ్ సిటీని కవర్ చేస్తుంది దీనికి రూ. 880 కోట్ల వ్యయం అవుతుందని సర్కారు అంచనా వేస్తోంది. మరోవైపు కారిడార్-IIలో 6 కి.మీ మేర 27 స్టాప్‌లు ఉంటాయి. దీని వ్యయం రూ. 600 కోట్లు. ఇది రాయదుర్గ్-టెక్ మహీంద్రా-హైటెక్ సిటీ/కొండాపూర్ కవర్ చేస్తుంది.
హెచ్‌ఎంఆర్‌ఎల్ ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి డీపీఆర్‌ను సమర్పించనుంది. PRT గంటకు 10,000 ప్యాక్స్‌ని నిర్వహిస్తుంది. PRT వ్యవస్థ మెట్రో స్టేషన్ల నుండి కార్యాలయాలు, ఇతర గమ్యస్థానాలకు అవాంతారలు లేని కనెక్టివిటీ అందించడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్లాన్‌వేస్తోంది. ఇది సాంప్రదాయిక రహదారి రవాణాపై ఆధారపడకుండా వేగవంతమైన, సున్నితమైన రవాణాను అందిస్తుంది.
పాట్ టాక్సీ (Pod taxi ) వ్యవస్థ అంటే ఏమిటి?
PRT వ్యవస్థ ఎలివేటెడ్, గైడెడ్ ట్రాక్‌లపై ప్రయాణించే చిన్న, బ్యాటరీతో పనిచేసే, డ్రైవర్‌లెస్ వాహనాలను కలిగి ఉంటుంది. ఒక్కో పాడ్‌లో 6-8 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టంతో పనిచేస్తుంది. ఎక్కిన తర్వాత, ప్రయాణికులు టచ్ ప్యానెల్‌లో తమ గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి. పాడ్ నేరుగా నిర్దేశించిన స్టాప్‌కు ప్రయాణిస్తుంది. అంతరాయం లేని ప్రయాణం కోసం పాడ్‌లను ప్రైవేట్‌గా కూడా అద్దెకు తీసుకోవచ్చు. పీక్ సమయాల్లో గంటకు 10,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది, రోజూ 1 లక్ష మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
ముంబైలో అభివృద్ధి
కాగా ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఇలాంటి పాడ్ టాక్సీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ ప్రాజెక్ట్, ఒకసారి కార్యరూపం దాల్చింది, భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ ప్రాంతాలలో పట్టణ రవాణాకు ఒక నమూనాగా మారడానికి సిద్ధంగా ఉంది. అయితే కొత్త వ్యవస్థ హైదరాబాద్‌లోని ఐటీ, బిజినెస్ ప్రాంతాల్లో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, మరింత క్రమబద్ధీకరించబడిన పట్టణ మౌలిక సదుపాయాలకు దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








