American social media | భారత్‌పై అమెరికన్ సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యతిరేక భావాలపై ఎలాన్ మస్క్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ గ్రైమ్స్ (Elon Musk’s Ex Girlfriend Grimes) తీవ్రంగా స్పందించారు. భారత్‌పై ఎక్కడి నుంచో పుట్టిన వ్యతిరేకతను ఉద్దేశపూర్వకంగానే విస్తరింపజేయడం దారుణమని ఖండించారు. కనడియన్ సంగీతకారిణి అయిన గ్రైమ్స్ తన పోస్టులో ఈ మేరకు అభిప్రాయపడ్డారు. అమెరికా సోషల్ మీడియా (American social media)లో చర్చిస్తున్న పరిస్థితులు ఇండియా (India)లో లేవని ఆమె పేర్కొన్నారు. తాను భారత్‌లో పెరిగానని, తన బాల్యాన్ని తానక్కడ అద్భుతంగా గడిపానని తెలిపారు. భారత్‌పై దుష్ప్రచారం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చశారు.
ఇది ఉద్దేశపూర్వక చర్య అన్న Grimes
తన పోస్ట్‌లో గ్రైమ్స్ నిరాశ వ్యక్తం చేస్తూ భారత్‌పై వ్యతిరేక భావాలను ఎక్కడి నుంచో అకస్మాత్తుగా సృష్టించడం దారుణం. ఇది ఉద్దేశపూర్వకమైన చర్య అన్నారు. అంతేకాదు.. ఇది ముందస్తు ప్రణాళికతో చేస్తున్న దుష్ప్రచారమని విమర్శించారు.
తన బాల్యం గురించి గ్రైమ్స్ వివరిస్తూ ‘నా స్టెప్‌డాడ్ భారతీయుడు. నేను అద్భుతమైన బాల్యాన్ని ఇండియన్ కుటుంబంలో గడిపాను. పాశ్చాత్య సంస్కృతితో భారతీయ సంస్కృతి చాలా బాగా కలిసిపోతుంది’ అని పేర్కొన్నారు.
ఇది జాత్యాంహకారం : Grimes
శ్రీరామ్ కృష్ణన్‌ను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నియమించుకున్న తర్వాత అమెరికాలోని సోషల్ మీడియాలో భారతీయులపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీన్ని గ్రైమ్స్ తీవ్రంగా ఖండించారు. భారతీయులపై వ్యాఖ్యలను ఆమె జాత్యాంహకార, ద్వేషపూరితమైనవని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
భారత్‌లో నేను నివసించా..
గ్రైమ్స్ అసలు పేరు క్లెయిర్ బోచర్. కెనడాలోని వాంకువర్‌లో పుట్టి పెరిగిన ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రవి సిద్ధూ అనే వ్యాపారవేత్తను తన తల్లి వివాహం చేసుకున్నారని గ్రైమ్స్ తెలిపారు. ఆయన వాంకువర్‌లో ఈస్ట్ ఇండియా కార్పెట్స్ డైరెక్టర్‌గా ఉన్నారని, ఆయనతో కలిసి కొన్నేళ్లపాటు తాము భారత్‌లో నివసించామని తెలిపారు. భారతీయ, అమెరికన్ సంస్కృతులు మిళితమై ఉన్నాయని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గ్రైమ్స్ పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న వారికి అలా ఉండదు..
అధికారంలో ఉన్న వారికి భారత్‌పై వ్యతిరేక భావాలు ఉండవని అభిప్రాయాన్ని గ్రైమ్స్ ఓ యూజర్‌తో పంచుకున్నారు. ‘అత్యున్నత స్థాయి వ్యక్తులు అలా అనుకోవడం లేదు. మన మెదడు సహజంగానే సామాజిక మీడియాపై కలిగే వ్యతిరేక భావాలపై స్పందిస్తోంది. లేనిపోని అపోహలు కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేయడం ముఖ్యం’ అని రియాక్ట్ అయ్యారు.
భారతీయ గాయకులు పాశ్చాత్య సంగీత రంగాలను ఆక్రమిస్తే ఏమవుతుందనే ప్రశ్నపై గ్రైమ్స్ స్పందించారు. ‘అమెరికాలో బాలీవుడ్ హిట్ కావడం లేదన్నదే నా అభిప్రాయం. నిజానికి నేను దీని కోసం పనిచేయాలి. భారతీయులు సంగీతంలో నాకంటే ప్రతిభావంతులు ఉన్నారు’ అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..