Gruha Jyothi scheme: గృహ జ్యోతి పథకం (Gruha Jyothi scheme) కింద వినియోగదారులకు ఉచిత విద్యుత్ (free electricity) అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.156.56 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అర్హులైన వారి గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. జీవో 10 ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం రూ.1,612.12 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇందులో భాగంగా మార్చి నెల ఖర్చుల కోసం రూ.156.56 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) సహా ఇతర విద్యుత్ పంపిణీ సంస్థలు అర్హులైన వినియోగదారులకు (domestic consumers) విద్యుత్ బిల్లులపై పూర్తిగా మాఫీ చేయనున్నాయి.
Gruha Jyothi scheme : నిధుల కేటాయింపులు ఇలా..
TGSPDCL(Telangana State Southern Power Distribution Company Limited) సీఎండీ ముషర్రఫ్ ఫారూఖీ ప్రభుత్వం నుంచి ముందస్తు నిధుల మంజూరు కోరగా ప్రభుత్వం రూ.156.56 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని వివిధ వర్గాలకు కేటాయించారు. సాధారణ రూ.118.99 కోట్లు, బీసీ సబ్ ప్లాన్‌కు రూ.23.48 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.14.09 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులను TGSPDCL ఖాతాకు ECS ద్వారా బదిలీ చేయాలని విద్యుత్ శాఖ సహాయ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సంస్థలు ఈ నిధులను వినియోగించిన తర్వాత ప్రభుత్వానికి వినియోగ నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
పెరుగుతున్న విద్యుత్ వినియోగం
ఈ పథకం అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగాన్ని నమోదుచేసుకుంది. మార్చి 2025లో రాష్ట్ర విద్యుత్ వినియోగం 17,162 మెగావాట్లకు చేరుకుంది. అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా నిధుల మంజూరు చేసి, ఉచిత విద్యుత్ పథకాన్ని (Gruha Jyothi scheme) నిరాటంకంగా కొనసాగించేలా చర్యలు చేపట్టింది.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఊరట
ఈ పథకం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడంతో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలపై భారం తగ్గుతుంది. అర్హులైన వినియోగదారుల (eligible households)కు జీరో విద్యుత్ బిల్లులు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం ఉచిత విద్యుత్ అందించడంలో దేశంలోనే ముందంజలో ఉంది. ఈ పథకం ద్వారా లక్షలాది గృహ వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ పథకాన్ని సాఫీగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








