Israeli tourist : కర్ణాటక (Karnataka)లో దారుణం వెలుగుచూసింది. ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపిలో ఇజ్రాయెల్ మహిళ (Israeli female tourist ) లైంగిక దాడికి గురైంది. ఆమెతోపాటే మరో మహిళపై కూడా దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నతరుణంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం రేపింది.
చెరువు వద్దకు వెళ్లగా..
ఇజ్రాయెల్‌కు చెందిన 27 ఏళ్ల యువతి కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం హంపీ (Hampi)ని సందర్శించేందుకు వచ్చింది. ఆమె అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బస చేసింది. ఆ ఇంటి యజమాని అయిన 29 ఏళ్ల మరో మహిళ కూడా ఆమెతో కలిసి ఉండేది. హంపీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాపూర్ చెరువు వద్దకు వీరు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి టూరిస్ట్‌లను టార్గెట్ చేశారు. మొదటగా పెట్రోల్‌కు 100 రూపాయలు కావాలని అడిగారు. వారు ఇవ్వకపోవడంతో దుండగులు వారిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మరో ముగ్గురు పురుష టూరిస్ట్‌లను కూడా కొట్టి చెరువులో పడేశారు. అనంతరం ఆ ఇద్దరు మహిళలను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు వారికి మత్తుమందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఒడిశాకు చెందిన పర్యాటకుడిని తీవ్రంగా కొట్టి కాలువలోకి తోయగా నీటమునిగి అతడు మృతి చెందాడు.
దేశ పరువును దిగజార్చేలా..
మనదేశం తరచుగా విదేశీ పర్యాటకుల (Tourists)ను ఆహ్వానిస్తూ వారికి సురక్షితమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది అంతర్జాతీయంగా మన పరువును దిగజార్చే అంశమని, టూరిస్ట్‌లపై దాడులు భారతదేశానికి చెడ్డ పేరు తెస్తాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Israeli tourist : పోలీసుల దర్యాప్తు ప్రారంభం
బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. కర్ణాటక ప్రభుత్వం ఈ ఘటనను చాలా తీవ్రంగా తీసుకుంది. నిందితులను త్వరగా అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..