Sarkar Live

వైష్ణవి మిల్లులో ధాన్యం ‘మాయం’.. డీటీ సాబ్ ‘బూతుల’ పురాణం! అడిషనల్ కలెక్టర్ స్పందించాల్సిందే.. ‌‌ – Rice mill Paddy Scam

Rice mill Paddy Scam : హన్మకొండ జిల్లా పంథినిలో ఉన్న వైష్ణవి రైస్ మిల్లు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదన్న వార్తలు

Rice mill Paddy Scam

Rice mill Paddy Scam : హన్మకొండ జిల్లా పంథినిలో ఉన్న వైష్ణవి రైస్ మిల్లు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ గోల్‌మాల్‌ను బయటపెట్టాల్సిన అధికారులే.. మిల్లర్ల తరపున బాకా ఊదుతుండటం విస్మయానికి గురిచేస్తోంది.​గణాంకాల ప్రకారం చూస్తే పరిస్థితి ఇలా ఉంది:

​వైష్ణవి రైస్ మిల్లు – ధాన్యం నిల్వల లెక్కల విశ్లేషణ

అంశంవివరాలు
రైస్ మిల్లు పేరువైష్ణవి రైస్ మిల్లు
ప్రాంతంపంథిని, హన్మకొండ జిల్లా
ప్రభుత్వం కేటాయించిన ధాన్యం584.320 మెట్రిక్ టన్నులు
అప్పగించాల్సిన మొత్తం బియ్యం (CMR)393.310 మెట్రిక్ టన్నులు (సుమారు 14 ఏసీకేలు)
ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరిన బియ్యం1 ఏసీకే (ACK) మాత్రమే
మిల్లులో ఉండాల్సిన పెండింగ్ నిల్వ13 ఏసీకేల బియ్యం (భారీ వ్యత్యాసం)
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిడీటీ భద్రునాయక్ (సివిల్ సప్లై విభాగం)
ప్రధాన ఆరోపణరికార్డుల్లో నిల్వలు లేకపోయినా ‘పర్ఫెక్ట్’ అని సర్టిఫికేట్ ఇవ్వడం
ప్రస్తుత స్థితిఉన్నతాధికారుల (అడిషనల్ కలెక్టర్) విచారణ కోసం డిమాండ్

​”ఏనా కొడుకు డబ్బులు ఇచ్చిండు?” – డీటీ భద్రునాయక్ సంచలన వ్యాఖ్యలు

​ఈ వ్యవహారంపై ‘సర్కార్ లైవ్’ ప్రతినిధి సివిల్ సప్లై డీటీ భద్రునాయక్‌ను వివరణ కోరగా, ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.​”ఏనా కొడుకు డబ్బులు ఇచ్చిండు? వైష్ణవి మిల్లులో స్టాక్ పర్ఫెక్ట్ గా ఉందని నేను నిరూపిస్తా” అంటూ మీడియా ప్రతినిధికే సవాల్ విసిరారు.​ఒక విచారణాధికారి పక్షపాత రహితంగా ఉండాలి. కానీ, విచారణ పూర్తి కాకముందే, మిల్లు యజమాని తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడటం ఆయన చిత్తశుద్ధిపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

​Vaishnavi Rice Mill Scam : నిరూపించాల్సింది మీడియాకు కాదు.. కలెక్టర్‌కు!

​డీటీ సాబ్ విసిరిన సవాల్‌పై సర్కార్ లైవ్ సూటిగా ప్రశ్నిస్తోంది. స్టాక్ సరిగ్గా ఉందని మీడియాకు నిరూపించాల్సిన అవసరం అధికారులకు లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న భౌతిక నిల్వలను లెక్కించి, ఆ వాస్తవ నివేదికను జిల్లా అదనపు కలెక్టర్ మరియు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులకు సమర్పించాలి.
​మాయమైన ధాన్యంపై వస్తున్న ఆరోపణలు నిజమా? లేక డిటి సమర్థన నిజమా? అన్నది తేలాలంటే,​ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగాలి. రికార్డులకు, మిల్లులో ఉన్న భౌతిక నిల్వలకు (Physical Stock) మధ్య తనిఖీ జరగాలి.​విచారణకు ముందే క్లీన్ చిట్ ఇస్తున్న అధికారుల పాత్రపై కూడా ఆరా తీయాలి.


అడిషనల్ కలెక్టర్ రంగంలోకి దిగాల్సిందే..

పంథినిలోని వైష్ణవి మిల్లులో ధాన్యం నిల్వల లెక్క తేలాలంటే హన్మకొండ అడిషనల్ కలెక్టర్ రంగంలోకి దిగాల్సిందే. మిల్లులో ధాన్యం నిల్వలు మాయం అయ్యాయని వస్తున్న ఆరోపణలపై, స్టాక్ పర్ఫెక్ట్ గానే ఉందని సర్టిఫికేట్ ఇస్తున్న డిటి పై తక్షణమే అడిషనల్ కలెక్టర్ మిల్లులో తనిఖీ చేపడితే అసలు విషయం బయటపడుతోంది.ప్రభుత్వ ధాన్యం అంటే ప్రజల సొమ్ము. వైష్ణవి మిల్లు వ్యవహారంలో అదనపు కలెక్టర్ జోక్యం చేసుకుని, మిల్లులోని ధాన్యం నిల్వలపై నిష్పక్షపాత విచారణ జరిపి, నిజా నిజాలను మీడియా సమక్షంలో వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?