- రెజోనెన్సు కళాశాలలపై చర్యలు ఎందుకు లేవు?
- కళాశాలలను సీజ్ చేయడానికి హన్మకొండ డీఐఈఓ వెనుకడుగు?
- అనుమతి లేని బ్రాంచీలపై ఫొటోలతో సహా కథనాలు వెలువరించినా చర్యలు శూన్యం
- కార్యాలయంలో దొరకడు… ఫోన్ లో అందుబాటులోకి రాడు!
Illegal Colleges in Hanamkonda | రెజోనెన్సు కాలేజీలపై డీఐఈఓ కు అమితమైన ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హన్మకొండ నగరంలో ఆ కాలేజి యాజమాన్యం అనుమతి లేకుండా 5 బ్రాంచీలను నిర్వహించడంతోపాటు ఐఐటీ, నీట్, జేఈఈ, ఏసీ తరగతుల పేర లక్షలరూపాయల ఫీజులు వసూళ్ళుచేస్తున్నట్లు తెలుస్తోంది. రెజోనెన్సు యాజమాన్యం అనుమతి లేకుండా కళాశాలలు నిర్వహిస్తున్న విషయాన్ని ఫొటోలతో సహ బహిర్గతం చేసినప్పటికీ డీఐఈఓ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఆ కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక అమ్యామ్యాల రహస్యం దాగి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Illegal Colleges : స్పందించడు… సీజ్ చేయడు
హన్మకొండ డీఐఈవో వైఖరి వింతగా కనిపిస్తోంది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిగా ఉన్న సదరు అధికారి తన ఛాంబర్ లో ఉండడం అరుదని, కనీసం ఫోన్ లోనైనా సంప్రదిద్దామని ఫోన్ లు చేసినా స్పందించడని అధికారి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలావుంటే అనుమతి లేకుండా నడుస్తున్న రెజోనెన్సు కళాశాలలపై బిల్డింగ్ ఫోటోలతో సహా కథనం (SarkarLive Exclusive) వెలువరించినప్పటికి ఇప్పటివరకు సదరు కాలేజీల (Illegal Colleges) పై చర్యలు కూడా తీసుకోవడానికి డిఐఈవో ఇష్టపడడం లేదని సమాచరం.ఇదే విషయం పై సర్కార్ లైవ్ ప్రతినిధి డిఐఈవో వివరణ కోసం మూడు రోజులుగా కార్యాలయానికి వెళ్తున్నప్పటికి ఆయన అందుబాటులో ఉండడం లేదు. కనీసం ఫోన్ లోనైనా వివరణ కోరుదామని మూడు రోజులుగా ఫోన్ చేస్తున్నా స్పందించడంలేదంటే రెజోనెన్సు కాలేజీలపై ఆ అధికారికి అంత మక్కువెందుకో.. దాని వెనుకున్న రహస్యమేంటో ఆయనకే తెలియాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                     
        
1 Comment
[…] వేదాంతు కళాశాల నిర్వహించడం పై సర్కార్ లైవ్ వరుస కథనాలు ప్రచురించగా హన్మకొండ […]