తహశీల్దార్ లీలలపై ఆర్డీవో నజర్ వేస్తే విస్తుపోవాల్సిందేనట..?
Hanmakonda | లంచావతారులు సైతం విస్తుపోయేలా హసన్ పర్తి (Hasanparthi) తహశీల్దార్ చేసిన అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండడంతో జిల్లావ్యాప్తంగా అధికారులతో పాటు సాధారణ ప్రజలు అవాక్కవుతున్నారు. ఇప్పుడు హసన్ పర్తి తహసీల్దార్ (tahsildar) లీలలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు, నాలా కన్వర్షన్లపై హన్మకొండ ఆర్డీవో ఒకవేళ దృష్టి సారిస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తాయని, తహశీల్దార్ బాగోతాలు బయటపడే అవకాశం ఉందని మండలంలో ప్రచారం జరుగుతోంది.
తహశీల్దార్ తన ఇష్టానుసారంగా నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను గజాల వారీగా నాలా కన్వర్షన్ చేసి మండలం వ్యాప్తంగా అక్రమ వెంచర్ లు చేస్తున్న రియల్టర్ లకు పూర్తిస్థాయిలో సహకరించాడని,తహశీల్దార్ విధుల్లో చేరినప్పటినుండి చేసిన నాలా కన్వర్షన్ లు కనుక ఆర్డీవో పరిశీలిస్తే సదరు అధికారి ఏస్థాయిలో రియల్టర్ లకు సహకరించాడో తెలుస్తోందని పలువురు మాట్లాడుకుంటున్నారు.

Hanmakonda ఆర్డీవో సార్ జర నజర్ వేయండి…
హన్మకొండ జిల్లా (Hanmakonda District) హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ (Vangapahad) గ్రామ రెవెన్యూ పరిధిలోని 401/A లో ఉన్న 3 ఎకరాల 12 గుంటల భూమిని పాస్ బుక్ కోసం పట్టాదారు అప్లికేషన్ పెట్టుకోగా ప్రస్తుత తహశీల్దార్ కంటే ముందు విధులు నిర్వహించిన ఇద్దరు తహశీల్దార్ (tahsildar) లు పొజిషన్ లో వేరే వ్యక్తి ఉండడంతో ఆ ఫైలును తిరస్కరించారు. కానీ ప్రస్తుత తహశీల్దార్ అదే భూమికి పాస్ బుక్ జారీ చేశారు.ఈ భూమికి పాస్ బుక్ జారీ చేసినందుకుగాను పెద్దమొత్తంలో లకారాలు చేతులు మారినట్లు పలువురు గుసగుసలాడుకోవడం కొసమెరుపు.అసలు విషయం ఏమిటంటే గత తహశీల్దార్ రిజెక్ట్ చేసిన ఫైలు కూడా ఇప్పటికీ అదే కార్యాలయంలో ఉండడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఇదే మండలంలోని ఎల్లాపూర్ (Ellapur) గ్రామంలో గత కొన్నిసంవత్సరాలుగా అంగడిగా పిలువబడే 316/E/2 లోని ప్రొసీడింగ్ నెంబర్ 2400489209 తో 8 గుంటల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే నాలా కన్వర్షన్ చేసినట్లు సమాచారం.దీనికి గాను తహశీల్దార్ కు ముడుపులు గట్టిగానే ముట్టొచ్చని ఎల్లాపూర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అంతేకాకుండా అనేక అక్రమ వెంచర్ (Illegal Venture) లలోని ప్లాట్లను గజాల వారీగా కన్వర్షన్చే (Nala conversion)సి ఒక్కో ప్లాటుకు ఒక్కో రేటు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.హసన్ పర్తి తహశీల్దార్ లీలలపై హన్మకొండ ఆర్డీవో కనుక విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సదరు తహశీల్దార్ లీలలపై పై ఆర్డీవో ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..