Hanuman Movie : మొదటి నుంచి కూడా వైవిద్యమైన కథలను ఎంచుకొని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). మొదటి సినిమా ‘అ’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తర్వాత వచ్చిన కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం, సినిమాలతో మిగతా డైరెక్టర్ల కంటే డిఫరెంట్ జానర్లో ఆలోచించి హిట్టుకొట్టారు.
ఇక గతేడాది తేజ సజ్జ (Teja Sajja) హీరోగా హనుమాన్ (Hanuman)అనే సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తక్కువ బడ్జెట్ లోనే తీసిన ఈ మూవీ దాదాపు 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
ఈ మూవీ విడుదలై ఏడాది అయిన సందర్భంగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తన చేతిపై గదతో ఉన్న టాటూ వేయించుకొని హనుమాన్ సినిమాలో నటించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఆ ఏడాది పెద్ద సినిమా హీరోల కంటే ఈయన తీసిన మూవీ పెద్ద హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ పెద్ద డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. నెక్స్ట్ తీయబోయే జై హనుమాన్ మూవీకి హనుమంతుడు క్యారెక్టర్ ఎవరు చేస్తారా అన్న సస్పెన్స్ కొన్ని రోజులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడిచిందంటే ఏ రేంజ్ లో ఈ మూవీ ఆడియన్స్ కి రీచ్ అయిందో ఊహించుకోవచ్చు. ఆ టైంలో చాలామంది బడా హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ పేర్లు కూడా వచ్చాయి.
ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హాజరై మాట్లాడిన సందర్భంలో హనుమంతుడిని తను చిన్నతనం నుండి ఎలా ఆరాధించేవాడో చెప్పుకొచ్చారు. తన ఆరాధ్య దైవం హనుమంతుడు అని అన్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఒక సన్నివేశంలో హనుమంతుడు క్యారెక్టర్ వేసి మెగాస్టార్ మెప్పించారు. దీంతో జై హనుమాన్ (Jai Hanuman Movie ) మూవీలో కచ్చితంగా ఆయన చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు.
కానీ కాంతారా మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రిషబ్ శెట్టి కి (Rishabh Shetty) ఆ అవకాశం వరించింది. హనుమంతుడు పాత్రలో తను ఏ విధంగా మెప్పిస్తాడు అనేది చూడాలి…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 Comments
[…] బ్రహ్మానందం నటించని సినిమా అనేది లేదు. పెద్ద హీరోల సినిమా […]
[…] అనౌన్స్ చేశారు. ఇందులో హనుమాన్ గా రిషబ్ శెట్టి ని(Rishab shetti) కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ […]