Kunjam Hidma Arrested | ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్ జిల్లా బోయిపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగుడా గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత కుంజం హిడ్మాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా గురువారం జిల్లాలోని డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్), పోలీస్ బలగాలు కుంజం హిడ్మాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాలు సమర్థవంతంగా ప్రతిస్పందించి హిడ్మాను అరెస్టు చేయగా.. మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.
అరెస్టు సమయంలో, భద్రతా బలగాలు హిడ్మా (Kunjam Hidma) వద్ద నుంచి ఒక ఏకే-47 రైఫిల్, 35 తుపాకీ గుళ్లను, 27 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 90 నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, సుమారు 2 కిలోల గన్‌పౌడర్, మావోయిస్టు సాహిత్యం, రేడియోలు, వాకీ-టాకీలు, మందులు మరియు ఇతర సామగ్రిని పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Kunjam Hidma Arrest : పోలీసులకు అతిపెద్ద విజయం..
కాగా హిడ్మా అరెస్టు భద్రతా బలగాలు సాధించిన మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. గతంలో ఇతడు హతమైనట్టు వార్తలు వచ్చినా ఆ తర్వాత అవి అవాస్తవమని తేలింది. చాలా కాలం పాటు కనీసం హిడ్మా ఫోటో కూడా లభించకుండా జాగ్రత్త పడ్డాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన కుంజం హిడ్మా (Kunjam Hidma History) 2007లో 14 ఏళ్ల వయస్సులోనే మావోయిస్టు సంస్థలో చేరాడు. ఆయన అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, 2019లో ఏరియా కమిటీ మెంబర్ (ఏసీఎం)గా ఎదిగాడు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక మావోయిస్టు సంఘర్షణల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఒడిశాలోని కొరాపుట్, మల్కాన్‌గిరి జిల్లాల్లో నమోదైన ఏడు ప్రధాన మావోయిస్టు కేసుల్లో అతడి పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








