Hari Hara Veera Mallu Movie Review | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మూవీ థియేటర్లో రిలీజ్ అయి చాలా కాలమే అయింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న హరిహర వీరమల్లు (Harihara Veeramallu) ఎట్టకేలకు ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది.మెగా సూర్య ప్రొడక్షన్ లో ఏ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా, పవన్ కెరియర్లో ఫస్ట్ పీరియాడిక్ మూవీ కావడం ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా మూవీ ఉందా అనేది తెలుసుకుందాం…..
స్టోరీ…
Hari Hara Veera Mallu మూవీ పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ. 16 వ శతాబ్దంలో డిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. అక్కడి ప్రజలు హిందువులుగా జీవించడానికి జిజియా పన్ను కడుతూ ఉంటారు. అతడిని ఎదిరించే యోధుడే హరిహర వీరమల్లు. ఉన్న వాళ్ల దగ్గర దోపిడీ చేసి ఇబ్బందులు పడుతున్న ప్రజల అవసరాలను తీరుస్తుంటాడు. ఒకసారి వీరమల్లు కుతుబ్ షాహీ వజ్రాలను దోపిడీ చేస్తాడు. అతడి ధైర్యం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ..డిల్లీలో ఔరంగజేబు కోటలో ఉన్న కోహినూరు వజ్రాన్ని తీసుకురావాలని కోరుతాడు.వీరమల్లు ఆ పని మీద డిల్లీకి బయలుదేరుతాడు. అసలు కుతుబ్ షాహీ మాట ఎందుకు వింటాడు..?అతడు వెళ్లే క్రమంలో జరిగిన పరిణామాలు ఏంటి..? వీరమల్లుకు పంచమి(నిధి అగర్వాల్)ఎలా పరిచయం అవుతుంది..? వీరమల్లు అనుకున్న పనిని సాధించాడా..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Hari Hara Veera Mallu : మూవీ ఎలా ఉందంటే..?
16వ శతాబ్దంలో ఔరంగజేబు పాలన ఎలా సాగిందో, ఆయన వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఫస్ట్ ఆఫ్ లో చూపించే ప్రయత్నం చేస్తూ తీసిన సీన్స్ బాగున్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఫస్ట్ ఆఫ్ లో పవన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాయి. కుతుబ్ షాహీ కి సంబంధించిన వజ్రాలను దోపిడీ చేసే సీక్వెన్స్ మూవీకే హైలెట్ అని చెప్పొచ్చు. అక్కడి నుండి కథ మంచి ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది.అక్కడక్కడ పవన్ ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయి. ఎక్కడో కృష్ణ నదీ దగ్గరలో దొరికిన కోహినూరు వజ్రం కుతుబ్ షాహీ ల దగ్గరి నుండి డిల్లీకి ఎలా చేరిందో చెప్పే ప్రయత్నం చేస్తూనే దానిని తిరిగి పొందడానికి కుతుబ్ షాహీ వీరమల్లుకు పని అప్పజెప్పడం, దానికి వీరమల్లు ఒప్పుకుని బయలుదేరే వరకు ఫస్ట్ ఆఫ్ బాగానే నడిచింది. కొల్లగొట్టినాదిరో సాంగ్ సిట్యువేషన్ కి తగ్గట్టుగా రాలేదని అనిపించింది. ఇది తప్ప ఫస్ట్ ఆఫ్ లో మైనస్ వెతకడానికి ఏమీ లేదని చెప్పొచ్చు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక ట్విస్ట్ హైలెట్ అని చెప్పొచ్చు.ఇక సెకండాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని ఊహించిన ఆడియన్స్ కి కొంత డిజప్పాయింట్ ఉంటుంది. సాగదీత సీన్లతో ప్రేక్షకుడికి ఇబ్బంది పడేలా నడుస్తుంది.కథ పరుగులు పెట్టకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. మూవీ మొత్తంలో ఎమోషనల్ సీన్స్ రాసుకోక పోవడం మైనస్ గా మారిందని చెప్పొచ్చు. ఇలాంటి స్టోరీలో ఆ ఎమోషన్ ఉంటే మరింత బాగుండేదని అనిపించింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ తో ఆడియన్స్ ఊపిరి పీల్చుకుంటారు.మూవీకి సెకండ్ పార్ట్ ఉంటుందనే సంకేతాన్ని ఇస్తూ ఎండ్ చేశారు.
నటీ నటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…
కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించిన విధానం బాగుంది. ఫస్ట్ ఆఫ్ లో ఇంట్రెస్టింగ్ గా నడిపించగా సెకండాఫ్ లో పట్టుకోల్పోయినట్టు అనిపించింది. సెకండాఫ్ పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే ఇంకా అదిరిపోయేదనిపించింది.ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫస్ట్ పీరియాడిక్ మూవీ కావడం ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయలేదు. అంతకు వంద రెట్ల పెర్ఫార్మెన్స్ తో థ్రిల్ చేశాడు.పర్ఫెక్ట్ యాప్ట్ అని అనిపించాడు. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా దుమ్ము దులిపాడు. ఔరంగజేబు గా బాబీ డియోల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అతడి యాక్టింగ్ తో అందరినీ డామినేట్ చేసేలా మెప్పించాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్ లో బాగా యాక్ట్ చేసింది.మిగతా నటీ నటులు వారి పాత్రల మేరకు పర్వాలేదని అనిపించారు. మెయిన్ మూవీకి ఆయువు పట్టు మ్యూజిక్ అని చెప్పొచ్చు. కీరవాణి పాటలు అంతలా లేకున్న బిజీ ఎం తో మాయ చేసాడు. అతడి బిజీ ఎం తో ఇంపార్టెంట్ సీన్స్ ఎలివేట్ అయ్యాయి. మరో హీరో కీరవాణి అనే చెప్పొచ్చు. అంతలా ఇంపాక్ట్ చూపించాడు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ బాగున్నాయి. కెమెరా పనితనం, ఎడిటింగ్ పర్వాలేదనిపించాయి. సెకండాఫ్ లో వీఎఫ్ ఎక్స్ దారుణంగా అనిపించాయి. ఆ విషయంలో మరింత శ్రద్ధ పెట్టీ ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ పవన్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అని చెప్పచ్చు.
ప్లస్ పాయింట్స్…
- పవన్ కల్యాణ్ యాక్టింగ్
- కీరవాణి బీజీఎం
- యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్…
- సెకండాఫ్లో సాగదీత సీన్లు
- వీఎఫ్ఎక్స్
రేటింగ్
3.8/5
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.