Medak News | తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ (sarva shiksha abhiyan) ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని మాజీ మంత్రి హరీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. మెదక్ పర్యటనలో భాగంగా దీక్ష శిబిరం ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి వాళ్ల ను పట్టించుకోలేదని, అంతేకాకుండా ఉద్యోగుల టెంట్ ను పీకేసి వారిని నిర్బంధించడంపై హరీష్‌రావు ఫైర్ అయ్యారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని హితువు పిలికారు. ఈ మేరకు హరీష్‌రావు బుధవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గతఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ లో శాంతియుంతంగా దీక్షలు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించడాన్ని,హరీష్ రావు ఖండించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత టైంలోనే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, వారిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ సంవత్సరం గడిచినా దీనిపై ఎలాంటి స్పందనలేదని మండిపడ్డారు. వారు డిమాండ్ల సాధన కోసం రిలే దీక్షలు చేస్తే అక్రమంగా నిర్బంధిస్తున్నారని విమర్శించారు.
Medak ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారుల ఇక్కట్లు
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) మెదక్ (Medak) పర్యటన సందర్భంగా మెదక్‌కు వచ్చే దారులన్నీ పోలీసులు మూసివేశారు. దీంతో 40 నిమిషాల పాటు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. . పోలీసుల చర్యలతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఇక మెదక్ చర్చి వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చారంటూ చర్చి గేట్లను మూసివేశారు. దీంతో గేట్ల బయట వేలాది మంది క్రైస్తవులు గంటల తరబడి నిరీక్షించారు. ఒక మహిళ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి వల్ల సాధారణ ప్రజలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఆమె మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    