- ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ
- ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్
- సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల
సర్కార్ లైవ్, సిద్ధిపేట : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాలని హరీష్ రావు కోరారు.
గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు అందరు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఈ బాకీ కార్డుని అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలన్నారు. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలని ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలన్నారు.
ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ ₹75,000 రైతుబంధు బాకీ ఉంది. ప్రతి మహిళకు ₹44,000 మహాలక్ష్మి బాకీ ఉంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఉద్యోగాలు, పింఛన్లు, భరోసా పథకాలన్నీ కాంగ్రెస్ హామీ ఇచ్చి అమలు చేయలేదని విమర్శించారు. అంతేకాక, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రతి ఇంటికీ బాకీ కార్డును పంపిణీ చేసి కాంగ్రెస్ పాలనలో జరిగిన మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టాడు. పోయిన యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చిండు మిగతా వాళ్లందరికీ ఎగ్గొట్టారని హరీష్‌రావు మండిపడ్డారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయని 12,000 ఇచ్చిండు. మిగతా మూడు వేలు ఇవ్వలేదని అన్నారు.
కాంగ్రెస్ 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఈరోజు వరకు లేదు. అత్తకు, కోడలు ఇద్దరికీ ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డివి అన్నీ గజినీకాంత్ మాటలు.. ఇంటికొక మహిళకు రేవంత్ రెడ్డి 44వేల రూపాయలు బాకీ పడ్డారు. 44000 ఇచ్చినంకనే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలి. అంతా మోసం. గాంధీల మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి పంచారు. ఒక దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, మరోదిక్కు భట్టి విక్రమార్క సంతకం పెట్టి గ్యారంటీ పేపర్లు పంచారు. 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు.
మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు 30 క్యాబినెట్ లైనా ఊసే లేదు. ఇచ్చిన హామీల అమలు గురించి ఎవరైనా అడుగుతారేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం చూడట్లేదని ఫైర్ అయ్యారు. ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద ₹2,500 ఇస్తామన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    