Sarkar Live

HCLTech : హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ విస్త‌ర‌ణ‌.. కొత్త‌గా 5,000 ఉద్యోగాలు

అంత‌ర్జాతీయ స్థాయి టెక్నాలజీ సంస్థ HCLTech హైదరాబాద్‌లో తన ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో 5,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ టెక్ దిగ్గజ సంస్థ

HCLTech

అంత‌ర్జాతీయ స్థాయి టెక్నాలజీ సంస్థ HCLTech హైదరాబాద్‌లో తన ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో 5,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో అత్యాధునిక సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఈ టెక్ దిగ్గజ సంస్థ సిద్ధమవుతోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో HCLTech సంస్థ ఈ కీల‌క ప్రకటనను చేసింది.

HCLTech కీల‌క ప్ర‌క‌ట‌న‌

దావోస్‌లో భాగంగా HCLTech సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయకుమార్ (C Vijayakumar)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి డి. శ్రీధర్ బాబు స‌మావేశ‌మ‌య్యారు. వీరి భేటీలో ఈ అంశంపై చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనంత‌రం ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో HCLTech సంస్థ ఈ కీల‌క ప్రకటనను చేసింది. హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. హైటెక్ సిటీ ప్రాంతంలో 3,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు కానుంది. త‌ద్వారా కొత్త‌గా 5000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.

టెక్నాలజీ రంగంలో పురోగ‌తి

హెచ్ సీఎల్ టెక్ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌నున్న ఈ కొత్త సెంట‌ర్ గ్లోబల్ క్లయింట్లకు క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా హైటెక్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో సేవలను అందించనుంది. తద్వారా ఈ సెంటర్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడటమే కాకుండా స్థిరమైన అభ్యున్నతికి మార్గం కానుంది. ఈ కేంద్రానికి ఇప్ప‌టికే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుంచి గోల్డ్ సర్టిఫికేషన్ లభించింది.

అవ‌కాశం ద‌క్క‌డం గ‌ర్వ‌కార‌ణం : HCLTech సీఈవో

హైద‌రాబాద్‌లో హెచ్ సీఎల్ టెక్ గ్లోబల్ నెట్‌వర్క్ స్థాప‌న‌కు ప్రాధాన్య కల్పించడం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ( HCLTech CEO & Managing Director) విజ‌య‌కుమార్ తెలిపారు. ఈ కొత్త టెక్ సెంటర్ త‌మ సామర్థ్యాలను పెంపొందించడమే కాకుండా నగరంలోని టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వచ్చే నెలలో ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి, ఐటీ మంత్రిని ఆయన ఆహ్వానించారు.

స్వాగ‌తిస్తున్నం : సీఎం రేవంత్‌రెడ్డి

దావోస్‌లో జ‌రుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశంలో హెచ్‌సీఎల్ టెక్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Telangana chief minister A Revanth Reddy) హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కేంద్ర స్థాప‌న‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. HCLTech విస్త‌ర‌ణ‌తో హైద‌రాబాద్‌కు మ‌రింత ప్రాధాన్యం ల‌భిస్తుంద‌ని, ప్రముఖ ఐటీ హబ్‌గా న‌గ‌రం మరింత బలోపేతం అవుతుంద‌ని అన్నారు.

ఇత‌ర న‌గ‌రాల్లోనూ విస్త‌రించాలి: మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు

ఐటీ, పరిశ్రమల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు (IT & Industries minister D Sridhar Babu) మాట్లాడుతూ సాంకేతిక రంగంలో ప్రోత్సాహం ఇచ్చేందుకు రాష్ట్రం కట్టుబడి ఉంద‌ని అన్నారు. హెచ్‌సీఎల్‌టెక్‌ను హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణలోని ఇత‌ర‌ నగరాల్లో విస్తరించాలని కోరారు. తద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయ‌ని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?