Heat Stroke : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈ వేసవి తీవ్రత పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు (temperatures) 44 డిగ్రీల వద్దకు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘హీట్ స్ట్రోక్’ (వడదెబ్బ)ను ప్రత్యేక విపత్తుగా (State Specific Disaster) ప్రకటించింది. ఎండల కారణంగా మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనుంది.
Heat Stroke : ఎండల తీవ్రత.. సర్కారు చర్యలు
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వడదెబ్బకు కార్మికులు, రైతులు, వృద్ధులు ఎక్కువగా గురవుతుంటారు. అలాగే బహిరంగంగా పనిచేసే కార్మికులు (construction workers, delivery workers), గర్భిణులు, అధిక బరువు ఉన్నవారు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కూడా దీని బారిన పడుతుంటారు. ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో లేదా వేసవికాలం (extreme summer)లో తీవ్రమైన శారీరక శ్రమ వల్ల ఏర్పడుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది.
Heat Stroke (హీట్ స్ట్రోక్) లక్షణాలు
- తీవ్రమైన తలనొప్పి
- విరామం లేకుండా చెమటలు రావడం, లేదా పూర్తిగా చెమటలు ఆగిపోవడం
- మైకమరచి పడిపోవడం
- గుండె వేగంగా కొట్టుకోవడం
- శరీరం ఉష్ణోగ్రత 104°F (40°C) కంటే ఎక్కువగా ఉండటం
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణ వైద్య సేవలు తీసుకోవాలి. ఆలస్యం చేస్తే ఇది మరణానికి దారితీయొచ్చు.
Specific Disaster : బాధిత కుటుంబానికి పరిహారం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు నమోదైంది. ఇప్పటికే కొన్ని మరణాలు కూడా వడదెబ్బ (Heat Stroke) వల్ల సంభవించినట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ప్రభుత్వం తీసుకున్న పరిహార నిర్ణయం ప్రకారం వడదెబ్బ కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం నేరుగా అందనుంది. ఇది తెలంగాణలో మొదటిది కాదు. గతంలో మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్ కూడా ఇలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి.
ప్రజలకు ప్రభత్వ హెచ్చరికలు
తెలంగాణ విపత్తు నిర్వహణ విభాగం (TSDMA) ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. ఎండలో అనవసరంగా బయట తిరగొద్దని సూచిస్తోంది. నీటిని విరివిగా తాగాలని అంటోంది. పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలని పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








