Hyderabad : తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని చత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురువనున్నాయి.
రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ (Warangal) జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. ఇక బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ (Andharpradesh) లోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురురవనున్నాయయి. కాకినాడ, పోలవరం, ఏలూరులో భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.