హిట్ ఫ్రాంచైజీ లు ఈ మధ్య ఎలా ఆడుతున్నాయో మనకు తెలుసు. బాలీవుడ్ హిట్ ఫ్రాం చైజీ హెరాఫేరీ (Hera Pheri 3) కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టులు కూడా భారీ విజయాలనే అందుకున్నాయి.
ఒకప్పుడు సినిమాను ఏలిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మధ్య సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతోంది. భారీ అంచనాలతో వచ్చిన మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. వందల కోట్ల హీరోల సినిమాలు కూడా యావరేజ్ రేంజ్ లోనే ఆగిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒకటో రెండో సినిమాలు బాలీవుడ్ కి ఊపిరి పోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో హెరాఫేరీ ప్రాంచైజీ నుండి మూవీ ని అనౌన్స్ చేశారు. హెరాఫేరీ 3 (Hera Pheri 3)రాబోతున్నట్టు తెలిపారు.
తొలి రెండు పార్టుల లో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, టబు, పరేష్ రావెల్ (Akshay Kumar, Sunil Shetty, tabu, Paresh Ravel) మెయిన్ క్యారెక్టర్ లలో యాక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే మూడో పార్టు ని అక్షయ్ కుమార్ నిర్మిస్తున్నారు.అయితే ఆ మధ్య మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ పరేష్ రావెల్ ఊహించని విధంగా చిత్ర బృందానికి షాక్ ఇచ్చాడు. ఈ మూవీ నుండి తప్పుకున్నట్టు ప్రకటించాడు. దీంతో ఆ మూవీ టీం కంగుతింది.
Hera Pheri 3 తెలుగు రీమేక్ లో నరేష్…
మూవీలో మెయిన్ క్యారెక్టర్ పరేష్ రావెల్ (Paresh Ravel) తప్పుకోవడంతో హెరాఫేరీ ఫాన్స్ కూడా షాక్ అయ్యారు. అసలు ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదు. ఆ క్యారెక్టర్ ను అంతలా మెప్పించే నటుడే లేడని చెప్పొచ్చు. అంతలా పరేష్ రావెల్ మూవీలో అదరగొట్టేసాడు. ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేశారు. అల్లరి నరేష్, ఆదిత్య ఓమ్, సీనియర్ హీరో నరేష్ నటించ గా బాలీవుడ్ లో హిట్టు అయినంతగా ఇక్కడ హిట్టు కాలేకపోయింది. మళ్ళీ రెండో పార్టు ని తెలుగులో తెరకెక్కించలేకపోయారు.
Hera Pheri 3 : మళ్లీ స్క్రీన్ పై నవ్వులు…
ఫ్యాన్స్ పరేష్ రావెల్ క్యారెక్టర్ లో వేరే నటుడిని ఊహించుకోలేరు. అక్షయ్ కుమార్ ఆ మధ్య పరేష్ రావెల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దావా కూడా వేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రజెంట్ అవన్నీ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూ లో పరేష్ రావెల్ ఈ ప్రాజెక్ట్ పై రియాక్ట్ అయ్యారు. హెరాఫేరీ 3 లో భాగం కానున్నట్టు తెలిపారు. మళ్ళీ ఆ కాంబో స్క్రీన్ పై నవ్వులు పూయిస్తుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.