Ratha Saptami : తిరుమల (Tirumala)లో రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘట్టం భక్తులకు కనుల విందు చేసింది. రథసప్తమి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams (TTD) లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ ఏడాది కూడా ఇక్కడ విస్తృత ఏర్పాట్లు జరిగాయి. మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు ( (Executive Officer (EO) Shyamala Rao), అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు తదితర సౌకర్యాలను ఈవో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పటిష్ట భద్రత నడుమ Ratha Saptami
పోలీసు, విజిలెన్స్ శాఖల సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన టీటీడీ యంత్రాంగం సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు భద్రత కల్పిస్తోంది.
నిరంతరాయంగా అన్న ప్రసాదం
రథసప్తమికి రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యారని అంచనా. ఎండ తీవ్రతతో ఇబ్బంది కలగకుండా షెడ్లు ఏర్పాటు చేసిన టీటీడీ, మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేస్తోంది. రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాలు పంపిణీ కొనసాగనుంది.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
రోజంతా మాడవీధుల్లోని గ్యాలరీలో ఉండే భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్న టీటీడీ (TTD) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, గ్యాలరీలలోకి చేరిన భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ప్రతి గ్యాలరీలో చలికాలంలో మంచుకు భక్తులు ఇబ్బంది పడకుండా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసింది. రథ సప్తమి రోజు గ్యాలరీలలోని భక్తులకు ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా సౌకర్యాలు చేపట్టారు. అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందుబాటులో ఉంచారు. వాహన సేవల సమయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు ఈవో సూచించారు.
3,500 మంది శ్రీవారి సేవకులు
రథసప్తమి (Ratha Saptami) సందర్భంగా వాహన సేవల్లో పాల్గొనే భక్తులకు నాలుగు మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అదనంగా 66 అన్నదాన కౌంటర్లు, 351 మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు. రథసప్తమికి 3,500 మంది శ్రీవారి సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో గ్యాలరీలలో అత్యవసర పరిస్థితి తలెత్తకుండా అగ్నిమాపక, మెడికల్ బృందాలను అందుబాటులో ఉంచారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..