Sarkar Live

Hit 3 | హిట్ -3 ట్రైలర్ చూస్తే అదిరిపోవాల్సిందే..

Hit 3 Trailer | నేచురల్ స్టార్ నాని (natural Star nani)లవర్ బాయ్ ఇమేజ్ నుంచే పూర్తిగా బయటికి వచ్చి ఫుల్ మాస్ అవతారంలో క్రిమినల్స్ భరతం పట్టే ఒక రూడ్ కాప్ ఎలా ఉంటాడో అటువంటి క్యారెక్టర్ లో

Hit 3 Trailer

Hit 3 Trailer | నేచురల్ స్టార్ నాని (natural Star nani)లవర్ బాయ్ ఇమేజ్ నుంచే పూర్తిగా బయటికి వచ్చి ఫుల్ మాస్ అవతారంలో క్రిమినల్స్ భరతం పట్టే ఒక రూడ్ కాప్ ఎలా ఉంటాడో అటువంటి క్యారెక్టర్ లో నటించిన మూవీ హిట్ 3(Hit 3). ఈ మూవీ ట్రైలర్ వచ్చింది. నాని సొంత బ్యానర్ వాల్పోస్టర్ సినిమాస్ , యూనానిమస్ ప్రొడక్షన్స్ పై (walpostar cinimas, unanimous productions) ప్రశాంతి తిపిర్నేని (prashanth tipirneni)నిర్మించారు. ఈ మూవీ మే 1న (May 1st)గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

హిట్ ది ఫస్ట్ కేస్,హిట్ ది సెకండ్ కేసు మూవీలతో ఆకట్టుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను (Shailesh kolanu)ఈ మూవీ కి కూడా తనే దర్శకత్వం వహించాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ గా వచ్చిన ఆ రెండు మూవీలలో మామూలుగానే హత్యలు వాటి ఇన్వెస్టిగేషన్ ను చూపెట్టగా ఈ మూవీలో నానితో హై వోల్టేజ్ వయోలెన్స్ ను చూపించబోతున్నాడు. ట్రైలర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాని లోని బ్రూటల్ పోలీస్ ను మాత్రమే చూపెట్టాడు. సీరియస్ లుక్ లో నేరస్థులకు దడ పుట్టించే అసలుసిసలు పోలీస్ ను పరిచయం చేశాడు.

Hit 3 Trailer : రూడ్ కాప్ గా నాని క్యారెక్టర్…

ట్రైలర్ స్టార్టింగ్ లోనే క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్స్ సెల్ లో ఉండాలి..లేకపోతే భూమిలో 6 ఫీట్స్ హోల్ లో ఉండాలి..అనే డైలాగ్ సినిమా మొత్తం తన క్యారెక్టర్ ఎంత రూడ్ గా ఉంటుందో చెప్తోంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే వెన్నులో వణుకు పుట్టించేలా చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని అదరగొట్టాడు. వయసు 9 నెలలు ఏం చేస్తారు సార్ తీసుకెళ్లి అని పోలీస్ స్టేషన్ లో ఒక తల్లి భయంతో మాట్లాడే మాటలు.. తను నేరస్థులు గురించి చెప్పే వివరాలు వారు ఎంతటి క్రూరమైన వారో చెప్తుంది.

ఇక ట్రైలర్ (Hit 3 Trailer ) మొత్తానికి చాగంటి వారి ప్రవచనం ఒక హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఆపదలో ఉన్నవారిని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహో రాత్రులు కష్టపడుతాడో ఆయనకి మాత్రమే తెలుస్తది అన్న లైన్ వింటే హీరో ఎంత కఠిన పరిస్థితులను ఎదుర్కోనైనా సరే ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి వెనుకడుగు వేయడు..ఎంతటి నేరస్తులైనా సరే తన నుండి తప్పించుకోలేరు అని చూపెట్టాడు.

మే 1న గ్రాండ్ రిలీజ్…

హీరోయిన్ కూడా ఒక దగ్గర నిన్ను అర్జున్ పిలవాలా లేకపోతే సర్కార్ అని పిలవాల అన్నప్పుడు జనాల మధ్య ఉన్నప్పుడు అర్జున్.. మృగాల మధ్యలో ఉన్నప్పుడు సర్కార్ అని చెప్పే డైలాగ్ తో తనలో రూడ్ కాప్ తో పాటు సాఫ్ట్ నేచర్ కూడా ఉందని చెప్పాడనిపించింది. ట్రైలర్ కు తగ్గట్టుగా మిక్కీ జే మేయర్ (Micky j mayer)బీజీఎం తో అదరగొట్టాడు. నాని ఇంతకుముందు సినిమాల్లో చేసిన క్యారెక్టర్ ల కంటే డిఫరెంట్ గా శైలేష్ కొలను ప్రజెంట్ చేశాడనడం లో సందేహం లేదు. మే 1న రిలీజ్ అవుతున్న ఈ మూవీ నానికి ఎలాంటి హిట్టు ను అందిస్తుం దో చూడాలి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?