HMPV threat : హైదరాబాద్: భారత్‌లో HMPV వైరస్ ప్రవేశించడంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. కరోనా మాదిరి వ్యాపించే లక్షణాలు కలిగి ఉండడంతో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వల్ల ప్రాణభయం లేదని అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్, బంజారాహిల్స్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బ్రాంచ్ ‘నమస్కారం ముద్దు-కరచాలనం వద్దు’ అనే నినాదాన్ని ఇస్తోంది. అంటే షేక్ షేక్‌కు బదులుగా చేతులు జోడించి పలకరించే అలవాటును మొదలుపెట్టాలని సూచిస్తోంది. సీజనల్ ఫ్లూ కేసులు, హైదరాబాద్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ముప్పు నేపథ్యంలో ఈ నినాదాన్ని ముందుకు తెచ్చింది.
HMPV threat : ముందుజాగ్రత్తలు:
- తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మీ నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూతో కవర్ చేసుకోవాలి.
- సబ్బు/హ్యాండ్ శానియిజర్‌తో తరచుగా చేతులు కడుక్కోవాలి.
- రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు.. మనుషుల మధ్య భౌతిక దూరం పాటించండి.
- పుష్కలంగా నీరు తాగాలి. పోషకాలతో కూడిన ఆహారాన్ని తినాలి. ఇంటిలోకి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
- అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోండి.
- సొంత వైద్యం పనికిరాదు.. సొంతంగా మందులను వావొఒద్దు.. అనారోగ్య లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించండి.
- ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఫ్లూ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “HMPV threat : హ్యాండ్‌షేక్ వద్దు.. నమస్కారమే ముద్దు..”