Temperature : భారతదేశం 2024లో అధిక ఉష్ణోగ్రత (Hottest Year 2024) ను చవిచూసిందని వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం 121 తర్వాత ఇదే మొదటిసారి అని తాజాగా ఓ నివేదికలలో వెల్లడించింది. 1901 తర్వాత అధికంగా 0.90 డిగ్రీ సెల్సియస్ నమోదైందని పేర్కొంది. 2024లో సగటు ఉష్ణోగ్రత 25.75 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది. ఇది సగటు ఉష్ణోగ్రత కన్నా 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ.
Hottest Year : ఏడాదంతా వేడియే..
దేశంలో ఇటీవల తీవ్ర చలికాలం (winter season) వాతావరణం నెలకొంది. అయితే.. ఇది వాస్తవం కాదని తెలుస్తోంది. వాతావరణ శాఖ నివేదికను పరిశీలిస్తే.. గడిచిన ఏడాదంతా అధిక ఉష్ణోగ్రతలే ఉన్నట్టు తెలుస్తోంది. 1901 తర్వాత భారత దేశం వాతావరణ చరిత్రలో అత్యంత వేడైన సంవత్సరంగా 2024 నమోదు చేసుకుంది. ఈ సంవత్సరం కనిష్ట సగటు ఉష్ణోగ్రత 1901 తర్వాత 0.90 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఇదే సమయంలో 2024 సంవత్సరం సగటు ఉష్ణోగ్రత 25.75 డిగ్రీ సెల్సియస్ గా ఉంది, ఇది వార్షిక సగటు ఉష్ణోగ్రత కన్నా 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ.
2024లో రికార్డ్ బ్రేక్
వాతావరణ శాఖ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపిన వివరాల ప్రకారం.. 2024 లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 31.25 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 0.20 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. కనిష్ట సగటు ఉష్ణోగ్రత 20.24 డిగ్రీ సెల్సియస్ నమోదైందిఇ. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 0.90 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ. 2024 లో 2016 సంవత్సరం రికార్డు బ్రేక్ అయ్యింది. 2016 లో ఉపరితల గాలుల సగటు ఉష్ణోగ్రత 0.54 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదు కాగా 2024లో సగటు ఉష్ణోగ్రత ఆ రికార్డును దాటింది. సగటు కనిష్ట ఉష్ణోగ్రత జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎక్కువగా నమోదైంది.
ప్రపంచ వ్యాప్తంగా అంతేనట!
Hottest Year in the world : భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా 2024 అత్యంత వేడైన సంవత్సరం గా నిలిచింది. యూరోపియన్ వాతావరణ విభాగం, కోపెర్నికస్ ఈ విషయం ధ్రువీకరించింది. కోపెర్నికస్ ఏజెన్సీ ప్రకారం.. 2024లో భూమి సగటు ఉష్ణోగ్రత 1850-1900 మధ్య కాలం కంటే 1.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. 2024 లో ప్రమాదకరమైన వేడి 41 రోజుల అదనంగా నమోదైంది. యూన్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. వాతావరణ మార్పుల కారణంగా 2024 లో అదనంగా 41 రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మానవ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    